Rapo22: రాపో22 నుంచి హీరోయిన్ ఫస్ట్ లుక్ రిలీజ్.. ఆకట్టకుంటున్న పోస్టర్
ఉస్తాద్ రామ్ పోతినేని (Ram Pothineni) నటిస్తున్న తాజా చిత్రం ‘రాపో22’ (Rapo22).
దిశ, సినిమా: ఉస్తాద్ రామ్ పోతినేని (Ram Pothineni) నటిస్తున్న తాజా చిత్రం ‘రాపో22’ (Rapo22). ఈ మూవీని టాప్ ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ (Mythry Movie Makers) నిర్మాణంలో యువ దర్శకుడు మహేష్ బాబు (Mahesh Babu) తెరకెక్కిస్తున్నారు. నవీన్ ఎర్నేని, వై. రవి శంకర్ నిర్మాతలు. ఇందులో యంగ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తుంది. అయితే.. ఈ చిత్రంలో సాగర్ పాత్రలో రామ్ నటిస్తుండగా.. ఇప్పటికే ఆయన క్యారెక్టర్ లుక్ రిలీజై మంచి స్పందన దక్కించుకుంది. ఈ క్రమంలోనే తాజాగా న్యూయర్ స్పెషల్‌గా హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే (Bhagyashree Borse) ఫస్ట్ లుక్ విడుదల చేశారు.
ఈ మేరకు ‘మన సాగర్ గాడి లవ్వు... మహా లక్ష్మి’ అంటూ హీరోయిన్ పాత్రను పరిచయం చేస్తూ పోస్టర్ రిలీజ్ చేశారు. ఇందులో హీరో హీరోయిన్లు జంటగా కనిపిస్తుండగా.. భాగ్య శ్రీ చుడీదార్ ధరించి ట్రెడిషనల్ లుక్ (Traditional Look)లో దర్శనమిచ్చి ఆకట్టుకుంది. ఇక రామ్ హీరోయిన్ చున్నితో ముఖం తుడుచుకుంటూ ఇచ్చిన క్యూట్ ఎక్స్‌ప్రెషన్ (cute expression) అయితే ఆడియన్స్ అందరి మనసు దోచుకుంది. కాగా.. ప్రజెంట్ వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ మూవీ ఫస్ట్ షెడ్యూల్ ఇటీవల పూర్తయినట్లు తెలుస్తుండగా.. త్వరలో ఈ మూవీ నుంచి మరిన్ని అప్‌డేట్స్ ఇవ్వనున్నారు మేకర్స్.