ఐకాన్ స్టార్ మూవీపై అలాంటి కామెంట్స్ చేసిన హీరో సిద్ధార్థ్.. ‘మిస్ యూ’ సినిమాకి బిగ్ షాక్ తగిలిందిగా

కోలీవుడ్ స్టార్ సిద్దార్థ్, యంగ్ బ్యూటీ అషికా రంగనాథ్ జంటగా నటించిన సినిమా ‘మిస్ యూ’.

Update: 2024-12-13 06:31 GMT

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ సిద్దార్థ్, యంగ్ బ్యూటీ అషికా రంగనాథ్ జంటగా నటించిన సినిమా ‘మిస్ యూ’. కోలీవుడ్ డైరెక్టర్ రాజశేఖర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని 7 మిల్స్ పర్ సెకండ్ బ్యానర్‌పై శ్యామ్యూల్ మాథ్యూ నిర్మిస్తున్నారు. ఇక ఈ మూవీ నుంచి ఇప్పటికే వచ్చిన అప్డేట్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అయితే మిస్ యూ మూవీ నవంబర్ 29 కే విడుదల కావాల్సి ఉండగా పోస్ట్ పోన్ అయి డిసెంబర్ 13కి అనగా.. ఈ రోజు ఈ చిత్రం థియేటర్లలో రిలీజ్ అయింది. అయితే తమిళనాడులో ఈ మూవీకి పాజిటివ్ టాక్ వస్తున్నా తెలంగాణలో మాత్రం కొనుగోలు జరగట్లేదని సినీ వర్గాలు పేర్కొన్నాయి. హైదరాబాద్ సిటీ అడ్వాన్స్ బుకింగ్స్‌లో నిన్నటి వరకు కేవలం 50 టికెట్లే బుక్ అయినట్లు వెల్లడించాయి. సుదర్శన్ థియేటర్‌లో 5 టికెట్లు బుక్కయ్యాయి. అయితే దీనికి కారణం సిద్ధార్థ్ 'పుష్ప-2' ఈవెంట్‌పై చేసిన జేసీబీ వ్యాఖ్యలే అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

అసలు ఏం జరిగిందంటే.. బిహార్ రాష్ట్రంలో నిర్వహించిన ‘పుష్ప2’ మూవీ ఈవెంట్‌కు జనం భారీగా తరలి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై సిద్ధార్థ్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘అదంతా మార్కెటింగ్, ప్రమోషన్స్. మనదేశంలో జేసీబీలు పని చేసే చోటుకు కూడా చాలా మంది చూడటానికి వస్తారు’ అని హీరో సిద్ధార్థ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇక ఈ కామెంట్స్ పై బన్నీ ఫ్యాన్స్ ఫుల్ ఫైర్ అయ్యారు. దీంతో ఈ ఎఫెక్ట్ మిస్ యూ మూవీపై పడింది.

Tags:    

Similar News