స్టైలీష్ లుక్‌లో దర్శనమిచ్చిన అక్కినేని హీరో.. ఆకట్టుకుంటున్న పోస్ట్
అక్కినేని హీరో నాగ చైతన్య ‘జోష్’ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు. అయితే ఈ మూవీ అంతగా హిట్ కాలేకపోయింది.
దిశ, సినిమా: అక్కినేని హీరో నాగ చైతన్య ‘జోష్’ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు. అయితే ఈ మూవీ అంతగా హిట్ కాలేకపోయింది. ఆ తర్వాత ‘ఏమాయ చేశావే’ చిత్రంలో నటించాడు. ఈ సినిమా సూపర్ హిట్ విజయం సాధించింది. ఇక ఈ చిత్రంలో తన సరసన నటించిన హీరోయిన్ సమంతతో ప్రేమలో పడ్డాడు. ఆమెతో కొన్నాళ్ళు లవ్‌లో ఉండి ఆ తర్వాత ఇరు కుటుంబాలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. కానీ పట్టుమని నాలుగేళ్ళు కూడా కలిసి ఉండలేక మనస్పర్థలు వచ్చి విడాకులు తీసుకున్నారు. ఇక డివోర్స్ తర్వాత సమంత మయోసైటీస్ వ్యాధి బారిన పడింది. కానీ చై మాత్రం స్టార్ హీరోయిన్ శోభిత ధూళిపాళతో డేటింగ్‌లో ఉంటూ రీసెంట్‌గా ఆమెని రీసెంట్‌గా వివాహం చేసుకున్నాడు.
ప్రస్తుతం చైతన్య ‘తండేల్’ మూవీలో నటిస్తున్నాడు. చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సాయిపల్లవి హీరోయిన్‌గా నటిస్తోంది. ఇక ఈ మూవీ లవర్స్ డే కానుకగా ఫిబ్రవరి 7న థియేటర్లలో రిలీజ్ కానుంది. ప్రస్తుతం చై ఆశలన్నీ ఈ సినిమాపైనే ఉన్నాయి. ఈ క్రమంలో నాగ చైతన్య ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తాజాగా నాగచైతన్య తన ఇస్టాలో ఓ స్టోరీ పెట్టాడు. అందులో బ్లాక్ అండ్ బ్లాక్ సూట్‌లో స్టైలీష్ లుక్‌లో దర్శనమిచ్చాడు. అయితే ఈ ఫొటోను చూసినట్లయితే ఏదో ఈవెంట్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ పిక్ నెట్టింట వైరల్‌గా మారగా.. దీన్ని చూసిన నెటిజన్లు వావ్ సూపర్ బ్రో అంటూ కామెంట్స్ చేస్తున్నారు.