Fish Venkat: రెండు కిడ్నీలు చెడిపోయి దీన స్థితిలో నటుడు.. ఎవరైనా సాయం చేయాలంటూ ఎమోషనల్

టాలీవుడ్ కామెడీ విలన్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఫిష్ వెంకట్(Fish venkat) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

Update: 2024-09-04 04:40 GMT

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ కామెడీ విలన్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఫిష్ వెంకట్(Fish venkat) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ‘సమ్మక్క సారక్క’ (sammakka sarakka) అనే మూవీతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఇతను.. తన యాస, నటనతో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. అలా వందలాది సినిమాల్లో నటించి మంచి ఫేమ్ సంపాదించుకున్నాడు. దాదాపు స్టార్ హీరోలందరితోనూ స్క్రీన్ షేర్ చేసుకున్నారు. అయితే ఇతను పవన్ కళ్యాణ్ నటించిన ‘గబ్బర్ సింగ్’(Gabbar Singh) మూవీలో కబడ్డీ ఆడి తన్నులు తిన్న సీన్ గుర్తు తెచ్చుకుంటే ఇప్పటికీ ప్రేక్షకుల్లో నవ్వులు చిందిస్తాయి. కాగా ప్రస్తుతం ఫిష్ వెంకట్ మాత్రం సినిమాల్లో కనిపించడం లేదు.

ఇదిలా ఉంటే.. తన నటనతో, కామెడితో కడుపుబ్బా నవ్వించిన ఫిష్ వెంకట్ ప్రస్తుతం తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. తన కుటుంబం దీన స్థితిలో ఉందని, ఎవరైన ఆదుకోవాలని వేడుకుంటున్నాడు. ఆయన మాట్లాడుతూ.. “ఆయాసం రావడంతో హాస్పిటల్‌కు వెళ్లాను. అయితే అక్కడే వారం రోజులు చికిత్స అందించిన తర్వాత డయాలసిస్ చేయాలని వైద్యులు చెప్పారు. కానీ అదేంటో మాకు తెలియదు. ఎందుకైనా మంచిదని నిమ్స్‌లో జాయిన్ అయ్యి.. అక్కడే డయాలసిస్ చేయించుకుంటున్నాను. సుమారు ఏడాదిన్నర కాలంగా డయాలసిస్(dialysis) చేయించుకుంటున్నాను. నాలుగేళ్ల క్రితం కాలికి చిన్న దెబ్బ తగిలింది. అదే టైంలో బీపీ, షుగర్ రావడంతో కాలు మొత్తం ఇన్పెక్షన్‌కు గురైంది. డాక్టర్లు ఆపరేషన్ కూడా చేశారు. అప్పటి నుంచి నా పరిస్థితి ఇలా అయ్యింది. రెండు కిడ్నీలు కూడా ఫెయిల్ అయిపోయాయి. ప్రస్తుతం నేను ఇంటి దగ్గరే ఉంటున్నాను. అనారోగ్య పరిస్థితుల కారణంగా ఎన్ని ఛాన్స్‌లు వచ్చినా వెళ్లలేకుపోతున్నాను. డబ్బులు లేకపోవడంతో గాంధీ హాస్పిటల్‌లో ట్రీట్‌మెంట్ చేయించుకుంటున్నాను. నా కుటుంబం గడవడానికి చాలా కష్టంగా ఉంది” అని ఫిష్ వెంకట్ భావోద్వేగానికి లోనయ్యాడు. ప్రస్తుతం ఆయన దీన పరిస్థితిని చూసి ఎవరైనా ఇండస్ట్రీ దాతలు ఆదుకోవాలంటూ నెటిజన్లు కామెంట్స్ రూపంలో కోరుతున్నారు.


Similar News