Tamannaah Bhatia: ఫ్యాన్స్ గెట్ రెడీ.. ‘ఓదెల-2’ మూవీ నుంచి బిగ్ అప్డేట్ వచ్చేస్తుందంటూ మూవీ మేకర్స్ ట్వీట్
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తమన్నా భాటియా(Tamannah Bhatia) నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఓదెల-2’(Odela-2).

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తమన్నా భాటియా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఓదెల-2’(Odela-2).ఈ సినిమా 2021లో వచ్చిన ‘ఓదెల రైల్వే స్టేషన్’కు సీక్వెల్‌గా రాబోతుంది. అశోక్ తేజయే(Ashok Tejay) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మధు క్రియేషన్స్(Madhu Creations) బ్యానర్‌పై సంపత్ నంది టీమ్ వర్స్‌పై మధు నిర్మిస్తున్నారు. అయితే ఇందులో తమన్నా నాగసాధు పాత్రలో నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్స్, టీజర్ విడుదలై అందరిలో క్యూరియాసిటీని పెంచాయి. తాజాగా, ‘ఓదెల-2’ మూవీ మేకర్స్ బిగ్ అప్డేట్ ఇచ్చారు. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా ఓ పోస్ట్ షేర్ చేశారు. మార్చి 22న ఉదయం 10: 35 గంటలకు బిగ్ అప్డేట్ రాబోతున్నట్లు వెల్లడించారు. ఇక ఈ పోస్ట్‌కు ‘‘చెడుకు వ్యతిరేకంగా యుద్ధం ప్రారంభమవుతుంది. రెడీగా ఉండండి’’ అనే క్యాప్షన్ జత చేశారు. దీంతో అది చూసిన తమన్నా అభిమానులు ఆనందపడుతున్నారు.