Venky Atluri: మీనాక్షి చౌదరి మూవీపై సక్సెస్ డైరెక్టర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) నటించిన హ్యాట్రిక్ చిత్రం ‘లక్కీ భాస్కర్’(Lucky Bhaskar).

Update: 2024-11-07 14:26 GMT
Venky Atluri: మీనాక్షి చౌదరి మూవీపై సక్సెస్ డైరెక్టర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
  • whatsapp icon

దిశ, సినిమా: మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) నటించిన హ్యాట్రిక్ చిత్రం ‘లక్కీ భాస్కర్’(Lucky Bhaskar). వెంకీ అట్లూరి(Director Venky Atluri) దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాను శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చూన్‌ఫోర్ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. మీనాక్షి చౌదరి(Meenakshi Chaudhary) హీరోయిన్‌గా నటించిన ఈ మూవీ దీపావళి స్పెషల్‌గా థియేటర్లలో అడుగుపెట్టి అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తూ సంచలన వసూళ్లతో దూసుకుపోతోంది. ‘సార్’ వంటి ఘన విజయం తర్వాత వెంకీ అట్లూరి-సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ కాంబినేషన్‌లో వరుసగా మరో బ్లాక్ బస్టర్ నమోదైంది. ఇందులో భాగంగా తాజాగా మీడియాతో ముచ్చటించారు దర్శకుడు వెంకీ అట్లూరి.

‘‘లక్కీ భాస్కర్’ సక్సెస్ చాలా చాలా సంతోషంగా ఉంది. ఒక్క శాతం కూడా నెగిటివ్ స్పందన రాకుండా.. ప్రీమియర్ల నుంచే అన్ని చోట్లా పాజిటివ్ టాక్ వచ్చింది. ప్రేక్షకులు, రివ్యూ రైటర్లు అందరూ సినిమా బాగుంది అన్నారు. ఇలా మూవీ చూసిన వారందరూ బాగుందని చెప్పడం నిజంగా గొప్ప విషయం. అదృష్టంగా భావిస్తున్నాను. నేను సాధారణ ప్రేక్షకులతో కలిసి సినిమా చూసినప్పుడు.. ప్రతి సన్నివేశానికి, ప్రతి సంభాషణకి వారి నుంచి వచ్చిన స్పందన చూసి చాలా చాలా సంతోషం కలిగింది. కొన్ని సంభాషణలు అప్పటికప్పుడు చిత్రీకరణ సమయంలో రాయడం జరిగింది. వాటికి కూడా ప్రేక్షకుల నుంచి ఊహించని స్పందన లభించింది. ఫస్ట్ హాఫ్ వినగానే ఈ సినిమా నేను చేస్తున్నాను అని దుల్కర్ చెప్పారు. షూటింగ్ ఎప్పుడు అనుకుంటున్నారు? ఎన్నిరోజుల డేట్స్ కావాలి? అని అడిగారు. 'లక్కీ భాస్కర్' విజయం సాధిస్తుందని దుల్కర్ బలంగా నమ్మారు. ఫైనల్‌గా ఈ మూవీ మంచి విజయాన్ని వరించింది. ఈ సినిమా గురించి ఒక్కటని కాదు, ఒక్కరని కాదు అందరూ ‘లక్కీ భాస్కర్’ బాగుందని ప్రశంసిస్తున్నారు’ అంటూ చెప్పుకొచ్చారు.

Tags:    

Similar News