మూర్ఖుడా.. నేను పొట్టి దుస్తులు వేసుకుంటే నీకేంటి? 

Update: 2022-02-02 07:30 GMT

దిశ, సినిమా : బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణె క్రేజ్‌ పెళ్లి తర్వాత కూడా ఏ మాత్రం తగ్గలేదు. మునుపటి కన్నా మరింత బోల్డ్ అండ్ హాట్‌గా కనిపించేందుకు సంకోచించని భామ.. తాజాగా 'గెహెరాయియా' సినిమాలోని ఇంటిమేట్ సీన్స్‌, లిప్ లాక్స్‌తో పిచ్చెక్కిస్తోంది. ఫిబ్రవరి 11న అమెజాన్ ప్రైమ్‌లో రిలీజ్ కానున్న ఈ మూవీ ప్రమోషన్స్‌లో పాల్గొంటున్న దీపికపై ఓ అడ్వర్టైజ్‌మెంట్ కంపెనీ డైరెక్టర్, ఇన్‌స్టా ఇన్‌ఫ్లుయన్సర్ ఫ్రెడ్డీ బర్డీ కామెంట్ చేశాడు. 'న్యూటన్ బాలీవుడ్ సూత్రం. గెహ్రాయియా రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న కొద్దీ దుస్తులు మరీ చిన్నగా అయిపోతున్నాయి' అంటూ సెటైర్ వేశాడు.

దీన్ని సీరియస్‌గా తీసుకున్న హీరోయిన్.. ఈ యూనివర్స్ 'ఎలక్ట్రాన్స్, ప్రొటాన్స్, న్యూట్రాన్స్‌'తో తయారు చేయబడిందని సైంటిస్టులు చెబుతుంటారు. కానీ మూర్ఖులను మెన్షన్ చేయడం మరిచిపోయారు' అని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. ఈ పోస్టుకు రిప్లై ఇచ్చిన ఫ్రెడ్డీ.. 'ప్రతి ఒక్కరు నిన్ను జడ్జ్ చేయరు. కొందరు నిజాలు కూడా చెప్తారు' అని తెలిపాడు.


Similar News