Nandamuri Balakrishna: డాకు మహారాజ్ మూవీపై క్రేజీ అప్‌డేట్.. హై-ఆన్ ఎనర్జీ & ఫియర్స్ ట్రాక్ రాబోతుందంటూ పోస్ట్

నందమూరి నటసింహం బాలకృష్ణ(Nandamuri Balakrishna), బ్లాక్ బస్టర్ డైరెక్టర్ బాబీ కొల్లి(Director Bobby Kolli) కాంబోలో వస్తు్న్న తాజా సినిమా ‘డాకు మహారాజ్’(Daaku Maharaaj).

Update: 2024-12-12 13:32 GMT

దిశ, సినిమా: నందమూరి నటసింహం బాలకృష్ణ(Nandamuri Balakrishna), బ్లాక్ బస్టర్ డైరెక్టర్ బాబీ కొల్లి(Director Bobby Kolli) కాంబోలో వస్తు  తాజా సినిమా ‘డాకు మహారాజ్’(Daaku Maharaaj). బాలయ్యబాబు 109వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్మెంట్స్(Sitara Entertainments) పతాకంపై నాగవంశీ(Nagavanshi) భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇక ఇప్పటికే ఇందులో నుంచి వచ్చిన పోస్టర్లు (posters), రెండు భారీ యాక్షన్ గ్లింప్స్ (Action Glimpses) తో పాటు కేవలం ప్రకటనలతోనే సినిమాపై భారీ హైప్ క్రియేట్ అయ్యింది.

దీంతో ‘డాకు మహారాజ్’ నుంచి వచ్చే అప్‌డేట్ కోసం ఫ్యాన్స్‌తో పాటు ప్రేక్షకులు ఎంతో ఈగర్‌గా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఈ చిత్రం నుంచి మరో క్రేజీ అప్‌డేట్ (crazy update) రివీల్ చేశారు చిత్ర బృందం. ఈ మేరకు ‘ఒక హై-ఆన్ ఎనర్జీ & ఫియర్స్ ట్రాక్ మీ ముందుకు రాబోతోంది! ‘డాకు మహారాజ్’ ఫస్ట్ సింగిల్ (First Single) డిసెంబర్ 14న విడుదల కాబోతుంది! ప్రోమో రేపు ఉదయం 10:08కి! రాబోతుంది’ ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. ప్రజెంట్ ఈ పోస్టర్ వైరల్ అవుతుండగా.. ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News