Chiranjeevi : సైఫ్‌ అటాక్‌పై ఖండించిన చిరంజీవి

బాలీవుడు నటుడు సైఫ్ అలీఖాన్(Saif Alikhan) పై జరిగిన దాడిపై టాలీవుడ్ అగ్రనటుడు చిరంజీవి(Chiranjeevi) స్పందించారు.

Update: 2025-01-16 05:55 GMT
Chiranjeevi : సైఫ్‌ అటాక్‌పై ఖండించిన చిరంజీవి
  • whatsapp icon

దిశ, వెబ్ డెస్క్ : బాలీవుడు నటుడు సైఫ్ అలీఖాన్(Saif Alikhan) పై జరిగిన దాడిపై టాలీవుడ్ అగ్రనటుడు చిరంజీవి(Chiranjeevi) స్పందించారు. సైఫ్‌ పై దాడి వార్త తనను తీవ్రంగా కలచివేసిందని మెగాస్టార్‌ ఆవేదన వ్యక్తం చేశారు. సైఫ్‌ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను అన్నారు. వారి కుటుంబ సభ్యులు మనో నిబ్బరంతో ఉండాలని ధైర్యం తెలిపారు. కాగా గురువారం తెల్లవారు జామున సైఫ్ అలీఖాన్ మీద బాంద్రా(Bandra)లోని ఆయన నివాసంలో ఓ అగంతకుడు దాడి చేసిన విషయం తెలిసిందే. ఆరుచోట్ల కత్తిపోట్లకు గురికాగా, ప్రస్తుతం లీలావతి ఆసుపత్రి(Leelavathi Hospital)లో అత్యవసర చికిత్స పొందుతున్నారు. తీవ్ర గాయాలపాలైన సైఫ్ పరిస్థితి సీరియస్ గానే ఉన్నట్టు సమాచారం.    

Tags:    

Similar News

Dhanashree Verma

Dhanashree Verma