Chhaava: బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్న ఛావా.. బాహుబలి-2 రికార్డ్ బద్దలు!

బాలీవుడ్ స్టార్ హీరో విక్కీ కౌశల్ (Vicky Kaushal), నేషనల్ క్రష్ రష్మిక మందన్న (Rashmika Mandanna) జంటగా నటించిన చిత్రం ‘ఛావా’

Update: 2025-03-11 09:20 GMT
Chhaava: బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్న ఛావా.. బాహుబలి-2 రికార్డ్ బద్దలు!
  • whatsapp icon

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరో విక్కీ కౌశల్ (Vicky Kaushal), నేషనల్ క్రష్ రష్మిక మందన్న (Rashmika Mandanna) జంటగా నటించిన చిత్రం ‘ఛావా’ (Chhaava). డైరెక్టర్ లక్ష్మణ్ ఉటేకర్ (Laxman Utekar) తెరకెక్కించిన ఈ మూవీలో దివ్యా దత్తా, అక్షయ్ ఖన్నా, అషుతోషి రానా తదితరులు కీలక పాత్రలో నటించారు. ఛత్రపతి శివాజీ తనయుడు ఛత్రపతి శంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా రూపొందిన ఈ మూవీ ఫిబ్రవరి 14న హిందీలో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ (blockbuster hit) సాధించింది. అంతే కాకుండా.. బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు (Collections) రాబడుతూ దూసుకుపోతుంది.

ఇందులో భాగంగా ‘ఛావా’ మూవీ ఇప్పటివరకు హిందీలో రూ. 516.8 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. దీంతో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) నటించిన ‘బాహుబలి-2’ (Bahubali-2) రికార్డును బద్దలు కొట్టింది. ఈ మేరకు బాహుబలి-2 చిత్రం ప్రపంచవ్యాప్తంగా (Worldwide) రూ. 1,788 కోట్లు రాబట్టగా.. కేవలం హిందీ (Hindi)లో రూ. 510.99 కోట్లు వసూలు చేసింది. కాగా.. ఛావా చిత్రం మార్చి 7న తెలుగు తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై రిలీజ్ చేసిన ఈ చిత్రం ఇక్కడ కూడా మంచి టాక్ తెచ్చుకుని సక్సెస్ అందుకుంది. ఈ మేరకు విడుదలైన 4 రోజుల్లో రూ. 10 కోట్లకు పైగా కలెక్షన్స్ వచ్చినట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News