Chaitanya- Shobitha: లవ్డ్ అప్ అంటూ ఆ ఫొటో షేర్ చేసిన అక్కినేని కపుల్.. ఏకిపారేస్తున్న నెటిజన్లు

అక్కినేని హీరో నాగ చైతన్య(Naga Chaitanya), కోడలు శోభిత ధూళిపాళ(Shobitha Dhulipala) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

Update: 2025-03-19 09:24 GMT
Chaitanya- Shobitha: లవ్డ్ అప్ అంటూ ఆ ఫొటో షేర్ చేసిన అక్కినేని కపుల్.. ఏకిపారేస్తున్న నెటిజన్లు
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: అక్కినేని హీరో నాగ చైతన్య(Naga Chaitanya), కోడలు శోభిత ధూళిపాళ(Shobitha Dhulipala) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సమంత(Samantha)తో విడాకుల తర్వాత చైతన్య.. ఈ బ్యూటీతో డేటింగ్ చేశాడు. అనంతరం ఎంగేజ్‌మెంట్ చేసుకుని షాక్ ఇచ్చాడు. ఇక గత ఏడాది డిసెంబర్ 4న పెళ్లి చేసుకున్నాడు. ఇక అప్పటినుంచి అఫీషియల్‌గా భార్య బర్తలయిన వీరు మ్యారేజ్ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. ఎక్కడికి వెళ్లిన జంటగా వెళ్లి స్పెషల్ అట్రాక్షన్‌గా నిలుస్తున్నారు. అంతేకాకుండా వాటిని సోషల్ మీడియాలో పంచుకుంటూ వావ్ అనిపిస్తున్నారు. ఈ క్రమంలో ఈ కపుల్ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.

తాజాగా నాగ చైతన్య, శోభితలు ఇన్‌స్టాగ్రామ్(Instagram) వేదికగా ఓ పోస్ట్‌ను షేర్ చేశారు. అందులో ‘వాగ్యూ కపుల్ కవర్‌ పేజ్‌’కి పోజులిచ్చారు. ఇక దానికి లవ్డ్ అప్ అనే క్యాప్షన్ కూడా జోడించారు. దీంతో ఈ పిక్స్ సోషల్ మీడియా(Social Media)లో వైరల్‌గా మారాయి. ఇక వాటిని చూసిన నెటిజన్లు ఆ పోజు లేంటి బాబు అని, చైతన్య సో బ్యూటిఫుల్.. శోభిత సో హ్యాండ్సమ్ అని, మగరాయుడిలా శోభిత.. ఆడపిల్లలా నాగ చైతన్య ఉన్నారని అలాగే మీలో ఎవరు భర్తనో ఎవరు భార్యనో అర్థం కావడం లేదంటూ పొట్టు పొట్టుగా తిట్ల వర్షం కురిపిస్తున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం వీరి పోస్ట్ పై మీరు కూడా ఓ లుక్ వేసేయండి.

Read More..

విడుదలైన నెల రోజులకే ఓటీటీలోకి వచ్చేస్తున్న రొమాంటిక్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..? 

Tags:    

Similar News