Hero Nani:బన్నీ అరెస్ట్ .. ప్రభుత్వం పై హీరో నాని ఫైర్!

ఐకాన్ స్టార్(Icon Star) అల్లు అర్జున్(Allu Arjun) అరెస్ట్ నేపథ్యంలో పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు తీవ్రంగా స్పందిస్తున్నారు.

Update: 2024-12-13 12:01 GMT

దిశ,వెబ్‌డెస్క్: ఐకాన్ స్టార్(Icon Star) అల్లు అర్జున్(Allu Arjun) అరెస్ట్ నేపథ్యంలో పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు తీవ్రంగా స్పందిస్తున్నారు. ఈ నేపథ్యంలో హీరో అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేయడం పై నేచురల్ స్టార్ నాని(Hero Nani) తీవ్రంగా స్పందించారు. ‘‘సినిమా వ్యక్తులకు సంబంధించిన ఏ విషయంలోనైనా ప్రభుత్వ అధికారులు, మీడియా చూపే ఉత్సాహం సాధారణ పౌరుల పై కూడా ఉండాలని కోరుకుంటున్నా. థియేటర్ ఘటన దురదృష్టకరం. మనం ఇలాంటి ఘటన నుంచి నేర్చుకోవాలి. జాగ్రత్తలు తీసుకుని మళ్లీ జరగకుండా చర్యలు చేపట్టాలి. ఇది మనందరి తప్పు. దీనికి ఒక వ్యక్తి బాధ్యత వహించడు’’ అని ట్వీట్ చేశాడు. ప్రస్తుతం నాని చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Tags:    

Similar News