బ్యాక్ ఇన్ జటాధర మోడ్ అంటూ ఆ ఫొటో షేర్ చేసిన బాలీవుడ్ బ్యూటీ.. నెట్టింట వైరల్ అవుతున్న పోస్ట్
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనాక్షి సిన్హా(Sonakshi Sinha) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనాక్షి సిన్హా(Sonakshi Sinha) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో సినిమాల్లో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్నది. ప్రస్తుతం తెలుగులో ‘జటాధర’(Jatadhara) అనే మూవీలో నటిస్తోంది. టాలీవుడ్ యంగ్ హీరో సుధీర్ బాబు(Sudheer Babu) హీరోగా వెంకట్ కళ్యాణ్(Venkat Kalyan) ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇక రీసెంట్‌గా ఈ భామ ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేసిన సంగతి విదితమే.
ఈ క్రమంలో తాజాగా ఈ బ్యూటీ సోషల్ మీడియా వేదికగా ఓ స్టోరీ పెట్టింది. అందులో ‘బ్యాక్ టు జటాధర మోడ్’ అంటూ ఓ ఫొటో షేర్ చేసింది. ఇక ఆ ఫొటోలో హ్యాండ్‌కు ఓ భారీగా ఉన్న బంగారపు కడియం ఉంది. అలాగే రింగ్ కూడా పెట్టుకుంది. ఇంకా పెద్ద పెద్ద గోర్లకు గోల్డ్ కలర్ నెయిల్ పాలిష్‌తో దర్శనమిచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.
