BIGG BOSS SEASON 8 : ఇదెక్కడి ట్విస్ట్‌ రా మామా.. షో మొదలైన ఫస్ట్‌డేనే ఎలిమినేషన్..

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 8 నేటి నుంచి ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ షో ప్రోమో రిలీజ్ చేశారు.

Update: 2024-09-01 08:32 GMT

దిశ, వెబ్‌డెస్క్: బిగ్‌బాస్ తెలుగు సీజన్ 8 నేటి నుంచి ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ షో ప్రోమో రిలీజ్ చేశారు. దీన్ని బట్టి చూస్తుంటే ఈసారీ కూడా నాగార్జుననే హోస్ట్‌గా వ్యవహరిస్తున్నట్లు తెలిసిపోయింది. మొదటిరోజు 16 మంది కంటెస్టెంట్స్, తొలిరోజు షో లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు... ప్రతీసారీ కంటెస్టెంట్స్ ఎవరికి వారు సింగిల్‌గా హౌస్‌లోకి వెళ్లేవారు. అయితే ఈసారి సింగిల్‌గా కాకుండా జంటగా హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. అంటే మొత్తంగా 8 జంటలు, మొదటి రోజు బిగ్ బాస్ సీజన్ 8 లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాయి.

'సరిపోదా శనివారం' ప్రమోషన్స్‌లో భాగంగా నేచురల్ స్టార్ నాని, హీరోయిన్ ప్రియాంక మోహన్, 'బిగ్ బాస్' హౌస్‌లోకి వచ్చారు. 'నేను నాలుగు వారాలు హాలీడేస్‌కి వెళ్తున్నా.. షో హోస్ట్ చేయమంటూ' నానిని నాగ్ కోరాడు. దానికి 'ఆ ఒక్కటి తప్ప..' అంటూ తప్పించుకున్నాడు నేచురల్ స్టార్. అలాగే వచ్చే వారం విడుదల అవుతున్న '35 చిన్న కథ కాదు' మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా హీరోయిన్ నివేదా థామస్, రానా దగ్గుబాటి కూడా వచ్చారు. ఈ ఇద్దరినీ ఓ వారం, 'బిగ్ బాస్' హౌస్‌లో టీమ్ మేట్స్‌గా ఉండాల్సిందిగా హోస్ట్ నాగార్జున కోరాడు. దానికి నివేదా నేను 3 డేస్ ఉంటా, రానా 5 డేస్ ఉంటాడు అని చెప్పి తన ‘35 చిన్న కథ కాదు’ అనే సినిమాను ప్రమోట్ చేసేసింది.

ఇదిలా ఉంటే.. దర్శకుడు అనిల్ రావిపూడి కూడా 'బిగ్ బాస్' షోకి గెస్ట్‌గా వచ్చాడు. అయితే అనిల్ రావిపూడి, గెస్ట్‌గా కాకుండా ఓ జోడిని ఎలిమినేట్ చేసేందుకు బిగ్ బాస్‌కి వచ్చాడు. తొలిరోజు హౌస్‌లోకి వచ్చిన 16 మందిలో ఇద్దరినీ స్వైప్ చేసి, ఆ స్థానంలో మరో ఇద్దరిని హౌస్‌లోకి తేవాల్సిందిగా బిగ్ బాస్, తనను కోరినట్టు చెప్పి షాక్ ఇచ్చాడు అనిల్ రావిపూడి. దీంతో ఈ సారీ షో వేరే లెవల్‌లో ఉండబోతుందని తెలుస్తోంది. ప్రోమో చూసిన నెటిజన్లు ఇదెక్కడి ట్విస్ట్ రా మామ ఫస్ట్ డేనే ఇంత ట్విస్ట్ ఇస్తే ఎలా అని కామెంట్స్ చేస్తున్నారు.

Full View


Similar News