Bhagyashree Borse: లేటెస్ట్ ఫొటోస్‌తో హీట్ పుట్టిస్తున్న బ్యూటీ..

యంగ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే (Bhagyashree Borse) గతేడాది ‘యారియాన్ 2’ తో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది.

Update: 2024-12-17 14:15 GMT

దిశ, సినిమా: యంగ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే (Bhagyashree Borse) గతేడాది ‘యారియాన్ 2’ తో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. తర్వాత ‘చందు ఛాంపియన్’ అనే మూవీలో నటించిన ఈ బ్యూటీ.. ఈ ఏడాది రవితేజ ‘మిస్టర్ బచ్చన్’ (Mr Bachchan) చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాకు బాక్సాఫీస్ (box office) వద్ద ఆశించినంత ఫలితం దక్కనప్పటికీ హీరోయిన్‌కు మాత్రం మంచి మార్కులే పడ్డాయి. తన అందం, యాక్టింగ్‌తో కుర్రాళ్లను ఆకట్టుకుంది.

ఇదిలా ఉంటే.. ఈ మూవీ తర్వాత మరో చిత్రం అనౌన్స్ చేయని ఈ బ్యూటీ సోషల్ మీడియా (Social Media) వేదికగా అభిమానులకు టచ్‌లో ఉంటోంది. ఇందులో భాగంగా తాజాగా తన X వేదికగా ‘మీ దృష్టిని ఆకర్షిస్తుంది’ అనే క్యాప్షన్ జోడించి కొన్ని ఫొటోస్ షేర్ చేసింది. ఇందులో వైట్ కలర్ టీ షర్ట్ అండ్ బ్లూ జీన్‌లో ఉన్న అమ్మడు లుక్స్‌కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ప్రజెంట్ ఈ ఫొటోలు నెట్టింట వైరల్ కావడంతో.. సో బ్యూటీఫుల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.

Tags:    

Similar News