Chiranjeevi: శునకానందం పొందటం కొందరికి అలవాటు.. చిరంజీవి వారసత్వం ఇష్యూపై ‘బేబీ’ నిర్మాత షాకింగ్ పోస్ట్

మెగా స్టార్ చిరంజీవి (Mega star Chiranjeevi) వారసత్వంపై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం విమర్శలను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.

Update: 2025-02-13 13:48 GMT
Chiranjeevi: శునకానందం పొందటం కొందరికి అలవాటు.. చిరంజీవి వారసత్వం ఇష్యూపై ‘బేబీ’ నిర్మాత షాకింగ్ పోస్ట్
  • whatsapp icon

దిశ, సినిమా: మెగా స్టార్ చిరంజీవి (Mega star Chiranjeevi) వారసత్వంపై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం విమర్శలను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ‘బ్రహ్మా ఆనందం’ ప్రీ రిలీజ్ వేడుకలో చిరంజీవి మాట్లాడుతూ.. తన వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లడానికి తనకు మనవడు కావాలని అన్నారు. నేను ఇంట్లో ఉన్నప్పుడు నా మనవరాళ్లు నా చుట్టూ ఉన్నట్లు అనిపించదు.. నేను లేడీస్ హాస్టల్ వార్డెన్‌లా చుట్టూ ఆడవాళ్లతో ఉన్నట్లు అనిపిస్తోంది. నా వారసత్వం కొనసాగాలంటే మనవడు కావాలి. కానీ చరణ్‌కి మళ్లీ ఆడపిల్ల పుడుతుందేమో అని నాకు భయంగా ఉందంటూ చేసిన కామెంట్స్ ప్రజెంట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. చిరంజీవి వ్యాఖ్యలను ఖండిస్తూ చాలా మంది నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా దీనిపై స్పందించిన ‘బేబీ’ నిర్మాత ఎస్‌కేఎన్ (Producer SKN) ఓ ట్వీట్ పెట్టారు. ‘True.. పెళ్లిళ్లు చేసి అత్తారింటికి సాగనంపిన చెల్లెళ్లకి సైతం తన స్వార్జిత ఆస్తులు పంచిన వ్యక్తిత్వ్యం ఆయనది.... నిండైన ఫామిలీ మాన్ ఎవరిని ఏమి అనని మనిషి కదా ఊరికే అవాకులు చెవాకులు పేలటం అనవసరంగా రాద్ధాంతం చేయటం తద్వారా ఒకరోజు శునకానందం పొందటం కొందరికి అలవాటు’ అంటూ పోస్ట్ పెట్టారు. ప్రజెంట్ ఇది వైరల్‌గా మారింది.

Tags:    

Similar News