Bollywod: బాలీవుడ్ హీరోస్ టాలీవుడ్ డైరెక్టర్స్ కోసం వెయిట్ చేస్తున్నారా?

టాలీవుడ్ సినిమాలు వెయ్యి కోట్ల క్లబ్ లోకి చేరడంతో బాలీవుడ్ తెలుగు సినీ ఇండస్ట్రీ వైపు చూస్తుంది.

Update: 2024-12-18 04:59 GMT

దిశ, వెబ్ డెస్క్ : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ( Allu Arjun) హీరోగా నటించిన చిత్రం పుష్ప 2 ( Pushpa 2) . సుకుమార్ ( Sukumar) డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు. వరల్డ్ వైడ్ గా ఈ మూవీ డిసెంబర్ 5న రిలీజ్ అయింది.

టాలీవుడ్  సినిమాలు వెయ్యి కోట్ల క్లబ్ లోకి చేరడంతో బాలీవుడ్ తెలుగు సినీ ఇండస్ట్రీ వైపు చూస్తుంది. ఇదంతా "ఆర్ ఆర్ ఆర్ ", " పుష్ప" సినిమా వల్లనే అని సినీ వర్గాల వారు అంటున్నారు. పుష్ప కి వచ్చిన ఫేమ్ తో దేశం మొత్తం తెలుగోడి గొప్పతనం గురించి చెప్పుకుంటున్నారు. ఇప్పుడు బాలీవుడ్ స్టార్లు కూడా తెలుగు డైరెక్టర్స్ కోసం చూస్తున్నారు. ఇటీవలే గోపిచంద్ మలినేని బాలీవుడ్ హీరోతో సినిమా తెరకెక్కించాడు. మన తెలుగు డైరెక్టర్స్ డేట్స్ కోసం బాలీవుడ్ హీరోలు వేచి చూస్తున్నారంటే .. ఇది గొప్ప విషయం. ముందు ముందు నేషనల్, ఇంటర్నేషనల్ లెవెల్ కి వెళ్లినా ఆశ్చర్య పడాల్సిన అవసరం లేదు. 

Tags:    

Similar News