Anil Ravipudi : ‘సంక్రాంతికి వస్తున్నాం’ సీక్వెల్‌పై క్లారిటీ ఇచ్చిన అనిల్ రావిపూడి.. ఇంట్రెస్టింగ్ కామెంట్స్ వైరల్
విక్టరీ వెంకటేష్(Venkatesh), ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి(Meenakshi Chowdhury) కలిసి నటించిన లేటెస్ట్ మూవీ ‘సంక్రాంతికి వస్తున్నాం’(Sankranthiki Vasthunam).

దిశ, సినిమా: విక్టరీ వెంకటేష్(Venkatesh), ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి(Meenakshi Chowdhury) కలిసి నటించిన లేటెస్ట్ మూవీ ‘సంక్రాంతికి వస్తున్నాం’(Sankranthiki Vasthunam). అనిల్ రావిపూడి(Anil Ravipudi) దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్(Sri Venkateswara Creations) బ్యానర్‌పై శిరీష్ నిర్మించారు. అయితే సంక్రాంతి కానుకగా జనవరి 14న థియేటర్స్‌లో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ టాక్‌తో దూసుకుపోతుంది. అంతేకాకుండా భారీ కలెక్షన్లు రాబడుతూ బాక్సాఫీసును షేక్ చేస్తుంది. ప్రేక్షకులను అలరించడంతో పాటు కలెక్షన్లు పెంచుకుంటోంది. ఈ క్రమంలో.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న డైరెక్టర్ అనిల్ రావిపూడి ఈ సినిమా సీక్వెల్‌పై క్లారిటీ ఇచ్చారు. ‘‘మళ్లీ సంక్రాంతికి వస్తున్నాం(Sankranthiki Vasthunam). ఈ చిత్రానికి ఆ స్పేస్ ఉంది. రాజమండ్రిలో ముగుస్తుంది. కాబట్టి అక్కడి నుంచి మళ్లీ స్టార్ట్ అవుతుంది. సీక్వెల్‌తో మరో మిరాకిల్ సృష్టించబోతున్నాం’’ అని చెప్పు్కొచ్చారు. దీంతో ఈ విషయం తెలుసుకున్న వెంకటేష్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.