ALLU Family: థియేటర్ వద్ద ఆకట్టుకుంటోన్న అల్లు ఫ్యామిలీ కటౌట్.. రామలింగయ్య నుంచి అయాన్ వరకు!
ప్రస్తుతం బయట, సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా పుష్ప పేరే వినిపిస్తుంది.
దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుతం బయట, సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా పుష్ప(Pushpa-2)పేరే వినిపిస్తుంది. టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు సుకుమార్(Tollywood famous director Sukumar) డైరెక్షన్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తోన్న పుష్ప-2 కోసం ఐకాన్ స్టార్(Icon star) ఫ్యాన్స్ వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. పుష్పరాజ్(Pushparaj) అద్భుతమైన యాక్టింగ్ వీక్షించేందుకు కేవలం ఒక్కరోజు మాత్రమే మిగిలి ఉంది. తెలుగు(Telugu), హిందీ(hindhi), మలయాళ(Malayalam), కన్నడ(, Kannada), తమిళ(Tamil) భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యే ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్స్ కూడా పాన్ ఇండియా లెవల్‌లో ఘనంగా నిర్వహిస్తున్నారు.
విడుదల నేపథ్యంలో చిత్రబృందం రీలీజ్ చేస్తోన్న టీజర్లు, గ్లింప్స్, ఆకట్టుకుంటోన్న అల్లు అర్జున్(Allu Arjun)- రష్మిక (Rashmika), శ్రీలీల(sreeleela) వేసిన స్టెప్పులు వదిలాక ప్రేక్షకుల్లో మరింత క్యూరియాసిటీ పెరుగుతోంది. ఇకపోతే బన్నీ అభిమానులు థియేటర్ల వద్ద ఇప్పటి నుంచే పెద్దఎత్తున సందడి చేస్తున్నారు. కటౌట్లు, బ్యానర్లు కడుతున్నారు. అయితే ఓ సినిమా థియేటర్ వద్ద ఫ్యాన్స్.. అల్లు కుంటుంబం మొత్తాన్ని కటౌట్‌తో ఏర్పాటు చేశారు. ఇందులో అల్లు రామలింగయ్య(Allu Ramalingaiah), అల్లు అరవింద్(Allu Aravind), అల్లు బాబీ(, Allu Bobby), అల్లు అర్జున్, అల్లు శిరీష్(Allu Sirish).. చివరకు అల్లు అయాన్(Allu Ayan) కూడా ఉండటం విశేషం. ప్రజెంట్ థియేటర్ వద్ద ఏర్పాటు చేసిన ఈ కటౌట్ నెట్టింట నెటిజన్లను ఆకట్టుకుంటోంది. దీన్ని వీక్షించిన అల్లు అర్జున్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికన హ్యాపీ కామెంట్స్ పెడుతున్నారు.