నాటు నాటు పాటకు అదిరిపోయే స్టెప్పులు వేసిన అక్కినేని హీరో.. లాస్ట్‌లో ట్విస్ట్ మామూలుగా లేదుగా
అక్కినేని హీరో అఖిల్(AKHIL) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సిసింద్రి సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఇండస్ట్రీకి ఇంట్రీ ఇచ్చిన ఆయన.. తర్వాత కాలంలో హీరోగా పలు సినిమాల్లో నటించాడు.

దిశ, వెబ్‌డెస్క్: అక్కినేని హీరో అఖిల్(AKHIL) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 'సిసింద్రి' సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఇండస్ట్రీకి ఇంట్రీ ఇచ్చిన ఆయన.. తర్వాత కాలంలో హీరోగా పలు సినిమాల్లో నటించాడు. అయితే అఖిల్ హీరోగా ఇప్పటి వరకు మంచి విజయం సాధించలేదనే చెప్పాలి. దీంతో ఎలాగైనా విజయం సాధించాలనే తపనతో ఉన్నాడు. ప్రస్తుతం ఆయన చేతిలో ఓ ప్రాజెక్ట్ ఉన్నట్లు సమాచారం. ఇక అతని వ్యక్తిగత విషయానికి వస్తే.. రీసెంట్‌గా బడా బిజినెస్ మ్యాన్ కూతురు అయినా జైనాబ్ రవడ్జీ(Jainab Ravdzee)తో ఎంగేజ్‌మెంట్ చేసుకున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా నాగార్జున ఎక్స్ వేదికగా ప్రకటించడంతో అందరికీ ఈ న్యూస్ స్ప్రెడ్ అయింది.
అయితే మ్యారేజ్ ఎప్పుడన్నది ప్రకటించలేదు. దీంతో వీరి మ్యారేజ్ డేట్ ఎప్పుడెప్పుడు అనౌన్స్ చేస్తారా అని అక్కినేని ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఈ క్రమంలో అఖిల్- జైనాబ్ పెళ్లి డేట్ కూడా ఫిక్స్ అయిందని తెలుస్తుంది. మార్చి 24న అఖిల్ వివాహం జరగబోతుందని సమాచారం. ఇప్పటికే ఇరు కుటుంబాలు దీని గురించి చర్చలు కూడా జరుపుకొని తేదీని ఫిక్స్ చేశారని టాక్. మరి ఇందులో నిజమెంతుందో తెలియాలంటే అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే. ఈ క్రమంలో అఖిల్‌కు సంబంధించిన ఓ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది.
వైరల్ అవుతున్న వీడియోలో అక్కినేని హీరో బ్లాక్ అండ్ బ్లాక్ డ్రెస్ వేసుకుని వేరే వ్యక్తితో పెయిర్ అప్ అయ్యాడు. ఇందులో నాటు నాటు సాంగ్‌కు అదిరిపోయే స్టెప్పులు వేస్తూ వావ్ అనిపించాడు. అయితే చివర్లో అఖిల్ కావాలనే పడ్డాడో లేదో స్లిప్ అయ్యాడో తెలియదు కానీ కింద పడ్డాడు. అంతటితో ఈ వీడియో కంప్లీట్ అయిపోయింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. ఇక దీన్ని చూసిన నెటిజన్లు అఖిల్ రామ్ చరణ్ ప్లేస్ తీసుకుని కావాలనే పడిపోయాడు అంటూ కామెంట్లు చేస్తున్నారు.