నటుడు ఫిష్ వెంకట్‌కి నిర్మాత‌ ఆర్థిక సాయం.. ఎప్పటికీ రుణపడి ఉంటానని భావోద్వేగం

కమెడియన్ విలన్‌గా గుర్తింపు సంపాదించుకున్న ఫిష్ వెంకట్(Fish Venkat) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పని లేదు.

Update: 2024-09-05 03:51 GMT
నటుడు ఫిష్ వెంకట్‌కి నిర్మాత‌ ఆర్థిక సాయం.. ఎప్పటికీ రుణపడి ఉంటానని భావోద్వేగం
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: కమెడియన్ విలన్‌గా గుర్తింపు సంపాదించుకున్న ఫిష్ వెంకట్(Fish Venkat) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పని లేదు. ప్రస్తుతం ఆయ‌న ద‌య‌నీయ స్థితిలో ఉన్నారు. ఒక‌ప్పుడు ఎంతో మందికి దానాలు చేసిన ఆయ‌న ఇప్పుడు వేరే వారి దగ్గర చేయి చాచే స్థితిలో ఉన్నారు. అతని పరిస్థితి తెలుసుకున్న నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు(Chadalavada Srinivasa Rao) ఫిష్ వెంకట్‌కు వైద్య, ఆర్థిక స‌హాయార్థం లక్ష రూపాయల సాయం అందించారు. టిఎఫ్‌పిసి(TFPC) ట్రెజరర్ నిర్మాత రామసత్యనారాయణ(Ramasthyanarayana), టిఎఫ్‌పిసి సెక్రటరీ టి.ప్రసన్నకుమార్(Prasanna Kuamar), దర్శకుడు కె.అజయ్ కుమార్(Ajay kumar),తెలుగు ఫిలిం ఫెడరేషన్ ప్రెసిడెంట్ అనిల్‌లు చదలవాడ శ్రీనివాసరావు తరఫున ఫిష్ వెంకట్‌కు చెక్కును అందించారు.

ఈ సంద‌ర్భంగా ఫిష్ వెంకట్ మాట్లాడుతూ.. “నా కష్టాన్ని తెలుసుకుని అడగకుండానే లక్ష రూపాయలు సహాయం అందించిన చదలవాడ శ్రీనివాసరావుకి ధన్యవాదాలు. ఆయన చేసిన ఈ సాయాన్ని ఎన్న‌టికి మ‌రిచిపోలేన‌ని, ఇందుకు నాతో పాటు నా కుటుంబం ఆయనకు ఎప్పటికీ రుణపడి ఉంటుందని, ఆ దేవుడి ఆశీస్సులు ఆయన పైన ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను" అని ఫిష్ వెంకట్ చెప్పుకొచ్చారు.


Similar News