జైల్లో నటుడు దర్శన్‌కు రాజ భోగాలు.. సిగరెట్ కాల్చుతూ నిందితులతో కలిసి ఎంజాయ్‌మెంట్

కన్నడ స్టార్ దర్శన్ తన ప్రియురాలు పవిత్ర గౌడకు అసభ్యకర వీడియోలు పంపిస్తున్నాడనే కోపంతో చిత్ర దుర్గకు చెందిన రేణుకా స్వామిని అత్యంత దారుణంగా కొట్టి చంపాడు.

Update: 2024-08-26 05:11 GMT

దిశ, వెబ్‌డెస్క్: కన్నడ స్టార్ దర్శన్ తన ప్రియురాలు పవిత్ర గౌడకు అసభ్యకర వీడియోలు పంపిస్తున్నాడనే కోపంతో చిత్ర దుర్గకు చెందిన రేణుకా స్వామిని అత్యంత దారుణంగా కొట్టి చంపాడు. ఈ కేసులో దర్శన్, అతని ప్రియురాలు పవిత్ర గౌడతో పాటు హత్యకు కారణమైన 16 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ప్రస్తుతం నిందితులు పరప్పన్ అగ్రహార జైలులో ఉన్నారు.

ఇదిలా ఉంటే.. ప్రస్తుతం జైల్లో చిప్పకూడు తినాల్సిన దర్శన్ దర్జాగా ఎంజాయ్ చేస్తూ రాజభోగాలు అనుభవిస్తున్న ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. కేవలం దర్శన్ మాత్రమే కాకుండా అతడి గ్యాంగ్ నిందితులంతా ఓ చోట చేరి.. బిందాస్‌గా ముచ్చట్లలో తేలిన ఫోటో ఒకటి నెట్టింట ట్రెండ్ అవుతుంది.

ఆ ఫొటోలో.. దర్శన్ కుడి చేతిలో కప్పు, ఎడమ చేతిలో సిగరెట్‌తో బ్యారక్ బయట కుర్చీలో కూర్చొని, అతనితో పాటు రేణుకా స్వామి హత్య కేసులో సహకరించిన అతని వెంట రౌడీ షీటర్ విల్సన్ గార్డెన్ నాగ, దర్శన్ మేనేజర్ నాగరాజు, అతని హెయిర్ స్టైలిస్ట్ కుల్ల సేన అని పిలువబడే మరొక ఖైదీ కూడా చిల్ అవుతున్నట్లు కనిపిస్తుంది. ఈ ముగ్గురు కుర్చీలో కూర్చుని ముచ్చట్లలో తేలారు. వేలు అనే మరో ఖైదీ ఈ ఫొటో తీసి అతడి భార్యకు పంపాడు. అది కాస్త లీక్ కావడంతో దర్శన్‌కు జైల్లో మంచి ఏర్పాట్లు చేశారని విమర్శలు మొదలయ్యాయి. కూర్చోవడానికి, కబుర్లు చెప్పుకోవడానికి కుర్చీలు ఏర్పాటు చేశారని, ఇతర ఖైదీలతో పోల్చితే దర్శన్‌ లగ్జరీ లైఫ్ అనుభవిస్తున్నాడన్న ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. ఏది ఏమైనప్పటికి ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.


Similar News