Lapata Ladies: ఆస్కార్ షార్ట్ లిస్ట్ సినిమాల్ని ప్రకటించిన అకాడమీ.. ‘లాపతా లేడీస్’ ఉందా?

సినీ ప్రేక్షకుల్లో ఎంతగానో ఆకట్టుకున్న చిత్రాల్లో ‘లాపతా లేడీస్’(Lapata Ladies) ఒకటి.

Update: 2024-12-18 04:38 GMT

దిశ, వెబ్‌డెస్క్: సినీ ప్రేక్షకుల్లో ఎంతగానో ఆకట్టుకున్న చిత్రాల్లో ‘లాపతా లేడీస్’(Lapata Ladies) ఒకటి. ఈ సినిమాకు బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్(Aamir Khan) మాజీ భార్య కిరణ్ రావు(Kiran Rao) దర్శకత్వం వహించింది. ఈ మూవీలో స్పర్శ్ శ్రీవాత్సవ(Sparsh Srivatsava), నితాన్షి గోయెల్(Nitanshi Goel), ప్రతిభ(Prathibha) వంటి నటీనటులు.. తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. ఇందుకోసం చిత్ర బృందం ఎంతగానో కష్టపడింది. అయితే ఇండియా నుంచి లాపతా లేడీస్ మూవీ 2025 ఆస్కార్‌కు ఎంపికైన సంగతి తెలిసిందే. కాగా నిన్న (డిసెంబరు 17) ఆస్కార్ షార్ట్ లిస్ట్ సినిమాలను అకాడమీ అధికారికంగా వెల్లడించింది.

ఇందులో అధికారికంగా ‘లాపతా లేడీస్’ ఆస్కార్ రేస్‌లో లేకపోవడం గమనార్హం. దీంతో ఈ మూవీ అభిమానులు డిసపాయింట్ అవుతున్నారు. ఈ లిస్ట్​లో బ్రెజిల్(Brazil), కెనడా(Canada)​కు చెందిన చిత్రాలు టాప్​‌లో నిలిచాయి. మహిళల ఫ్రీడమ్ గురించి.. భవిష్యత్తుపై నిర్ణయాలు తీసుకోగల సామర్థ్యం గురించి.. ఆర్థిక స్వేచ్చ, అన్ని విషయాల గురించి ధైర్యంగా మాట్లాడే శక్తి గురించి సినిమాగా రూపొందించి.. నటీనటులు జనాల్ని మెప్పించారు. అంతేకాకుడా ఆస్కార్ క్యాంపెయిన్‌(Oscar campaign)లో భాగంగా వరుస స్క్రీనింగ్‌లను కూడా ప్రదర్శించింది టీమ్. ఎంతో కష్టపడినప్పటికీ ఆస్కార్ షార్ట్ లిస్ట్‌లో చోటు దక్కలేదు. 

Tags:    

Similar News