సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. ప్రముఖ నటుడు కన్నుమూత

సినీ ఇండస్ట్రీ(Film industry)లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.

Update: 2025-02-28 13:53 GMT
సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. ప్రముఖ నటుడు కన్నుమూత
  • whatsapp icon

దిశ,వెబ్‌డెస్క్: సినీ ఇండస్ట్రీ(Film industry)లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్ర‌ముఖ ఒడియా న‌టుడు ఉత్త‌మ్ మొహంతీ(66)(Uttam Mohanty) క‌న్నుమూశారు. వివరాల్లోకి వెళితే.. తీవ్రమైన కాలేయ వ్యాధితో బాధ‌ప‌డుతున్న ఆయ‌న గురుగ్రామ్‌లోని మెడాంటా ఆసుపత్రి(Hospital)లో చికిత్స పొందుతూ నిన్న(గురువారం) రాత్రి తుది శ్వాస విడిచారు. ఈ మేరకు ఆయన కుటుంబ సభ్యులు ప్రకటించారు. నటుడు ఉత్త‌మ్ మొహంతీ మ‌ర‌ణ‌వార్త తెలుసుకున్న ఆయ‌న అభిమానులు, సినీ ప్ర‌ముఖులు, రాజకీయ నాయ‌కులు సోషల్ మీడియా వేదికగా సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

ఉత్తమ్ మొహంతీ సినీ కెరీర్..

ఆయన 1977లో అభిమాన్ మూవీ(Abhiman Movie)తో ఒడియా సినీ ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఈ చిత్రంతోనే తన సినీ జీవితాన్ని ప్రారంభించారు. ఈ క్రమంలో న‌టుడిగా రాణిస్తున్న కొద్ది కాలంలోనే అగ్ర న‌టుడిగా మంచి పేరు సంపాదించుకున్నారు. త‌న 50 ఏండ్ల సినీ కెరీర్‌లో దాదాపు 135కి పైగా సినిమాల్లో న‌టించారు. ఈయన ఒడియాతో పాటు 30 బెంగాలీ సినిమాల్లో కూడా నటించారు. అలాగే హిందీ మూవీ ‘నయా జహెర్’లో నటించారు.

Tags:    

Similar News