Pawan Kalyan: ‘OG’ అప్డేట్ అడిగిన అభిమాని.. దిమ్మతిరిగే రిప్లై ఇచ్చిన నిర్మాణ సంస్థ

టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కల్యాణ్(Pawan Kalyan), సుజీత్(Sujeeth) కాంబినేషన్‌లో రాబోతున్న భారీ బడ్జెట్ మూవీ ‘ఓజీ’(OG).

Update: 2024-12-01 07:09 GMT

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కల్యాణ్(Pawan Kalyan), సుజీత్(Sujeeth) కాంబినేషన్‌లో రాబోతున్న భారీ బడ్జెట్ మూవీ ‘ఓజీ’(OG). దీనిని డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య(D. V. V. Danayya) అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇందులో ప్రియాంకా మోహన్(Priyanka Arul Mohan) హీరోయిన్‌గా నటిస్తుండగా.. శ్రియా రెడ్డి, ఇమ్రాన్ హష్మీ(Emraan Hashmi) కీలక పాత్రలో నటిస్తున్నారు. అయితే ఈ సినిమాకు తమన్ (Thaman)సంగీతం అందిస్తున్నారు. కోలీవుడ్ స్టార్ హీరో శింబు(Simbu) స్పెషల్ సాంగ్ పాడనున్నారు. ఇప్పటికే ‘ఓజీ’ చిత్రం నుంచి విడుదలైన అప్డేట్స్ అన్ని భారీ అంచనాలను పెంచాయి.

ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా నుంచి అప్డేట్స్ తెలుసుకునేందుకు పవన్ అభిమానులు ఆసక్తి చూపిస్తున్నారు. నిత్యం నిర్మాణ సంస్థను ట్యాగ్ చేస్తూ పోస్టులు పెడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఓ అభిమాని ‘‘ఓజీ అప్డేట్ ఇచ్చి చావు’’ అని పోస్ట్ పెట్టాడు. అంతేకాకుండా డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌(DVV Entertainments)ను ట్యాగ్ చేశాడు. ఇక అది చూసిన వారు ‘‘అప్డేట్స్ ఇవ్వకుండా చావనులే. ఉన్నప్పుడు ఇస్తాను. ప్రస్తుతానికి సీజ్ ది షిప్’’ అని రిప్లై ఇచ్చారు. అంతేకాకుండా బ్రహ్మానందం(Brahmanandam) ఆవేశంతో కొట్టుకుంటూ వెళ్తున్న జిఫ్‌ను షేర్ చేశారు.

Tags:    

Similar News