ఫ్యాన్స్‌కు బంపరాఫర్‌.. మెగాస్టార్‌ ఇంట్లో ఉండే ఛాన్స్‌.. దానికోసం ఏం చేయాలంటే?

హీరో, హీరోయిన్స్ లైఫ్ ఎంత రిచ్‌గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

Update: 2025-03-24 04:36 GMT
ఫ్యాన్స్‌కు బంపరాఫర్‌.. మెగాస్టార్‌ ఇంట్లో ఉండే ఛాన్స్‌.. దానికోసం ఏం చేయాలంటే?
  • whatsapp icon

దిశ, సినిమా: హీరో, హీరోయిన్స్ లైఫ్ ఎంత రిచ్‌గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వాల్లు ఏం చేయకున్నా సరే లగ్జరీ లైఫ్‌ను లీడ్ చేసేందుకు ఎక్కువ ప్రాధాన్యతను చూపిస్తుంటారు. దానికి కారణం అలా చేస్తేనే సినిమా అవకాశాలు రావడంతో పాటు సోసైటీలో మంచి గుర్తింపు వస్తుందని భావిస్తుంటారు. బట్టలకే వేలకు వేలు ఖర్చు చేస్తుంటారు. అయితే సెలబ్రిటీలను చూసేందుకు అభిమానులు వారి ఇంటి ముందు పడిగాపులు కాస్తుంటారు. అంతేకాకుండా వారి లైఫ్‌స్టైల్ ఎలా ఉంటుంది, ఇల్లుఇలా అన్ని తెలుసుకోవాలనుకుంటారు. చాన్స్ వస్తే ఇంటికి కూడా వెళ్తుంటారు. అలా చేయానుకునే వారికి ఇది ఓ బంపర్ ఆఫర్ అని చెప్పాలి. తాజాగా, మలయాళ మెగాస్టార్ ఏకంగా తన ఇంట్లోనే ఉండే అవకాశం ఇస్తున్నట్లు సమాచారం. తన గదిలో బస చేసే చాన్స్ ఇస్తున్నారు. అందు కోస్ హోటల్‌లో ఉంటే ఎలా అయితే రెంట్ కడతారో అలా ఒక రోజుకి రూ. 75 వేలు కట్టాల్సిందేనట.

అసలు విషయంలోకి వెళితే.. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి(Mammootty) అందరికీ సుపరిచితమే. ఇప్పటికీ వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. అయితే ఆయనకు కేరళ కొచ్చిలోని పనంపిల్లి నగర్‌(Panampilly Nagar)లో ఓ ఇల్లు ఉన్నట్లు తెలుస్తోంది. కొద్ది కాలంపాటు ఆయన నివాసం ఉన్నారు. కానీ 2020లో ఎర్నాకులం(Ernakulam)లోనికి షిఫ్ట్ అయ్యారు. ఇక కొచ్చిలోని ఇల్లు కాళీగా ఉంటుందని ఓ నిర్ణయానికి వచ్చారు. సకల సౌకర్యాలు ఉన్న ఆ ఇంటివి వదిలేయలేక అక్కడ అభిమానులకు ఆతిథ్యం ఇవ్వాలని ప్లాన్ చేశారట. అయితే వారినే కలిసే అవకాశం ఉండనప్పటికీ ప్రైవేట్ థియేటర్, గ్యాలరీ రూమ్ చూసేందుకు మాత్రం చాన్స్ ఇస్తారట. అయితే ఇందుకోసం ఏప్రిల్ 1నుంచి బుకింగ్స్ మొదలుపెట్టనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుండటంతో అది చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.

Read More..

Sai Dharam Tej: మెగా హీరోకు నోటీసులు పంపిన పోలీసులు.. కారణం అదేనా?  

Tags:    

Similar News

Monami Ghosh