ఏపీ కూడా చొరవ చూపాలి :గీతా ఆర్ట్స్

దిశ, వెబ్‎డెస్క్: సినీ ఇండస్ట్రీపై ఏపీ ప్రభుత్వం కూడా చొరవ చూపాలని ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ కోరింది. కరోనా సమయంలో నష్టపోయిన చిత్ర పరిశ్రమకు సీఎం కేసీఆర్ భారీ రాయితీలు ప్రకటించారు. సినిమా థియేటర్లు, పరిశ్రమలు, అన్ని రకాల షాపులకు ఇచ్చిన బిల్లును చెల్లించాల్సిన అవసరం లేదని ప్రకటించారు. దీంతో తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన రాయితీల పట్ల గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ హర్షం వ్యక్తం చేశారు. మరోవైపు సీఎం కేసీఆర్ ప్రకటన […]

Update: 2020-11-24 09:03 GMT

దిశ, వెబ్‎డెస్క్: సినీ ఇండస్ట్రీపై ఏపీ ప్రభుత్వం కూడా చొరవ చూపాలని ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ కోరింది. కరోనా సమయంలో నష్టపోయిన చిత్ర పరిశ్రమకు సీఎం కేసీఆర్ భారీ రాయితీలు ప్రకటించారు. సినిమా థియేటర్లు, పరిశ్రమలు, అన్ని రకాల షాపులకు ఇచ్చిన బిల్లును చెల్లించాల్సిన అవసరం లేదని ప్రకటించారు. దీంతో తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన రాయితీల పట్ల గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ హర్షం వ్యక్తం చేశారు.

మరోవైపు సీఎం కేసీఆర్ ప్రకటన పట్ల దర్శకులు ఎస్‌.ఎస్‌. రాజమౌళి, పూరీ జగన్నాథ్, సంపత్‌ నంది, హీరో మహేశ్ బాబుతో పాటు పలువురు సినీ ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారు. కేసీఆర్‌ ప్రకటన చిత్ర పరిశ్రమకు పూర్వవైభవం తీసుకొస్తుందని రాజమౌళి ట్వీట్‌ చేశారు. పరిశ్రమలో మంచి పురోగతి కనిపిస్తుందన్నారు. ఇక ప్రభుత్వం ప్రకటించిన రాయితీలు పరిశ్రమకు ఎంతో మేలు చేకూర్చేలా ఉన్నాయని మహేశ్‌ బాబు అన్నారు. కొవిడ్ పరిస్థితుల్లోనూ పరిశ్రమపై దృష్టి సారించిన కేసీఆర్, కేటీఆర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Tags:    

Similar News