ఏపీకి బిగ్ అలర్ట్.. ఈ జిల్లాల్లో పిడుగులతో వర్షం

రాష్ట్రానికి వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది....

Update: 2025-04-14 15:50 GMT
ఏపీకి బిగ్ అలర్ట్.. ఈ జిల్లాల్లో పిడుగులతో వర్షం
  • whatsapp icon

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రానికి వాతావరణ శాఖ(Meteorology Department) అలర్ట్ జారీ చేసింది. మూడు రోజుల పాటు పిడుగుల(Thunder)తో కూడి వర్షం పడే అవకాశం ఉందని హెచ్చరించింది. అలాగే పలుచోట్ల భిన్నమైన వాతావరణ పరిస్థితులు ఉంటాయని వెల్లడించింది. ఈ సమయంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయని స్పష్టం చేసింది. కోస్తా, రాయలసీమ(Coast, Rayalaseema)లో మంగళవారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షం పడుతుందని ప్రకటించింది.

ఉమ్మడి అనంతపురం, కర్నూలు, తూర్పుగోదావరి, విశాఖ, విజయనగరం,శ్రీకాకుళం జిల్లాల్లో పలుచోట్ల పిడుగులతో పాటు వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వర్షాల నేపథ్యంలో అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. లోతట్టు ప్రాంతాల జనం మరింత జాగ్రత్తగా ఉండాలని తెలిపింది. కొన్ని సమయాల్లో వృక్షాలు, కరెంట్ స్తంభాలు కూలిపోయే ప్రమాదం ఉందని పేర్కొంది. పిడుగుల పడే అవకాశం ఉండటంతో వర్షం పడే సమయంలో రైతులు పొలాలకు వెళ్లొద్దని, గొర్రెల కాపరులు చెట్ల కింద అసలు ఉండొద్దని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. 

Tags:    

Similar News