హైదరాబాద్‌కు అండగా సినీ ఇండస్ట్రీ..

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణలో సంభవించిన అధిక వర్షపాతం కారణంగా జరిగిన వినాశనం ఊహించిన దాని కంటే ఎక్కువగానే ఉందన్నారు మహేశ్ బాబు. ఇలాంటి సమయంలో బాధిత కుటుంబాలకు అండగా నిలిచిన తెలంగాణ ప్రభుత్వం, డీఆర్ఎఫ్ బృందాలను అభినందించారు. తనవంతు సహాయంగా తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్‌కు కోటి రూపాయలు విరాళంగా ప్రకటించారు. ఇలాంటి కష్ట సమయాల్లో అందరూ కలిసి రావాలని కోరారు. వర్షాలు, వరదలతో హైదరాబాద్‌లోని చాలా మంది జీవితాలు అతలాకుతలం అయ్యాయని అన్నారు ఎన్టీఆర్. […]

Update: 2020-10-20 04:15 GMT

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణలో సంభవించిన అధిక వర్షపాతం కారణంగా జరిగిన వినాశనం ఊహించిన దాని కంటే ఎక్కువగానే ఉందన్నారు మహేశ్ బాబు. ఇలాంటి సమయంలో బాధిత కుటుంబాలకు అండగా నిలిచిన తెలంగాణ ప్రభుత్వం, డీఆర్ఎఫ్ బృందాలను అభినందించారు. తనవంతు సహాయంగా తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్‌కు కోటి రూపాయలు విరాళంగా ప్రకటించారు. ఇలాంటి కష్ట సమయాల్లో అందరూ కలిసి రావాలని కోరారు.

వర్షాలు, వరదలతో హైదరాబాద్‌లోని చాలా మంది జీవితాలు అతలాకుతలం అయ్యాయని అన్నారు ఎన్టీఆర్. మన నగర పునరావాసం కోసం తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్‌కు 50 లక్షల రూపాయలు అందిస్తున్నట్లు తెలిపారు. మనమందరం స్టాండ్ తీసుకుని.. మన హైదరాబాద్‌ను పునర్నిర్మించుకుందాం అని పిలుపునిచ్చారు.

భారీ వర్షాలు, వరదలు హైదరాబాద్ ప్రజల జీవితాన్ని నాశనం చేశాయన్నారు నాగార్జున. తక్షణ ఉపశమనం కోసం తెలంగాణ ప్రభుత్వం రూ. 550 కోట్లు విడుదల చేయడంపై అభినందించారు. ఈ ఆపత్కాలంలో ప్రభుత్వంతో నిలబడి.. తెలంగాణ సీఎం సహాయ నిధికి రూ. 50 లక్షలు అందిస్తున్నట్లు చెప్పారు.

వీరితో పాటు విజయ్ దేవరకొండ, హారిక అండ్ హాసిని క్రియేషన్స్, త్రివిక్రమ్ శ్రీనివాస్ రూ. 10 లక్షల విరాళం ప్రకటించగా.. హరీష్ శంకర్, అనిల్ రావిపూడి రూ.5 లక్షల చొప్పున తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్‌కు విరాళం అందించారు. ప్రతి ఒక్కరూ వీలైనంతత సహాయం అందించాలని కోరారు.

https://twitter.com/iamnagarjuna/status/1318454361131872256?s=19

Tags:    

Similar News