ఏడాది తర్వాతే రికవరీ ఉండొచ్చు!
దిశ, వెబ్‌డెస్క్: భారత పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) దేశంలోని 300 మంది కంపెనీల్లోని సీఈవోలతో ఒక సర్వే నిర్వహించింది. దేశంలోకి ఆర్థిక కార్యకలాపాలపై లాక్‌డౌన్ ప్రభావం తీవ్రంగా ఉందని సీఐఐ తెలిపింది. రెండింట మూడొంతుల మంది చిన్న, మధ్య తరహా సంస్థలకు చెందిన వారిలో 65 శాతం మంది సీఈవోలు తమ కంపెనీల ఆదాయం జూన్‌తో ముగిసే త్రైమాసికానికి 40 శాతం వరకూ తగ్గుతుందని అభిప్రాయపడినట్టు సర్వే చెబుతోంది. అంతేకాకుండా, లాక్‌డౌన్ ఎత్తేసిన తర్వాత వ్యాపార సంస్థల ఆర్థిక […]
దిశ, వెబ్‌డెస్క్: భారత పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) దేశంలోని 300 మంది కంపెనీల్లోని సీఈవోలతో ఒక సర్వే నిర్వహించింది. దేశంలోకి ఆర్థిక కార్యకలాపాలపై లాక్‌డౌన్ ప్రభావం తీవ్రంగా ఉందని సీఐఐ తెలిపింది. రెండింట మూడొంతుల మంది చిన్న, మధ్య తరహా సంస్థలకు చెందిన వారిలో 65 శాతం మంది సీఈవోలు తమ కంపెనీల ఆదాయం జూన్‌తో ముగిసే త్రైమాసికానికి 40 శాతం వరకూ తగ్గుతుందని అభిప్రాయపడినట్టు సర్వే చెబుతోంది. అంతేకాకుండా, లాక్‌డౌన్ ఎత్తేసిన తర్వాత వ్యాపార సంస్థల ఆర్థిక కార్యకలాపాలు ఇంతకుముందున్న సాధారణ స్థాయికి చేరడానికి కనీసం సంవత్సరం పడుతుందని సర్వేలో పాల్గొన్న 45 శాతం మంది తెలిపారు.
సర్వేలో పాల్గొన్న సీఈవోల్లో 45 శాతం మంది తమ రంగాల్లో 30 శాతం వరకూ ఉద్యోగాల కొత ఉండొచ్చని అభిప్రాయం వ్యక్తం చేశారు. రెండింట మూడొంతుల మంది మాత్రం తాము పనిచేస్తున్న సంస్థల్లో ఎలాంటి జీతాల కోత విధించలేదని పేర్కొన్నారు. 2020-21 ఆర్థిక సంవత్సరానికి 20 శాతం నుంచి 40 శాతం వరకూ ఆదాయం తగ్గుంతుందని 32 శతం సంస్థలు అంచనా వేస్తున్నాయి. అలాగే, లాక్‌డౌన్ కారణంగా కార్యకలాపాలు నిలిచిపోవడం, ఉత్పత్తులకు డిమాండ్ భారీగా పడిపోవడం ఆందోళనకరంగా ఉన్నట్టు పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ‘లాక్‌డౌన్ ఎత్తేసిన అనంతరం ఆర్థిక పరిస్థితి పుంజుకోవడానికి పరిశ్రమలకు ఆర్థిక ఉద్దీపన ఎంతో అవసరమని సీఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజీత్ చెప్పారు.
Tags: CII survey, activities significantly hit, CEOs survey, revenues to fall more