పోస్ట్‌మన్ శివన్‌కు చిరు థ్యాంక్స్
ఈ మధ్య పోస్ట్‌మన్ డి. శివన్ గురించి మీడియాలో చాలా ప్రచారం జరిగింది. ప్రతిరోజు ఏనుగులు, పులుల వంటి క్రూర జంతువులు, జలపాతాలను దాటుకుంటూ 15 కిలోమీటర్ల దూరం నడిచివెళ్లి మెయిల్ ఇచ్చేవాడు. 30 ఏళ్లు అత్యంత అంకితభావంతో పని చేసిన ఆయన పదవీ విరమణ పొందగా ప్రశంసలు అందుకున్నారు. Chanced upon this.For many people, doing their job despite all adversities gives utmost satisfaction.Thanks to such great beings, humanity […]
ఈ మధ్య పోస్ట్‌మన్ డి. శివన్ గురించి మీడియాలో చాలా ప్రచారం జరిగింది. ప్రతిరోజు ఏనుగులు, పులుల వంటి క్రూర జంతువులు, జలపాతాలను దాటుకుంటూ 15 కిలోమీటర్ల దూరం నడిచివెళ్లి మెయిల్ ఇచ్చేవాడు. 30 ఏళ్లు అత్యంత అంకితభావంతో పని చేసిన ఆయన పదవీ విరమణ పొందగా ప్రశంసలు అందుకున్నారు.
Chanced upon this.For many people, doing their job despite all adversities gives utmost satisfaction.Thanks to such great beings, humanity thrives. #UnsungHeroes https://t.co/5N50UYR5zi
— Chiranjeevi Konidela (@KChiruTweets) July 11, 2020
ఈ విషయంపై స్పందించారు మెగాస్టార్ చిరంజీవి. ఎన్ని కష్టాలు వచ్చినా, కేటాయించిన పని పూర్తి చేయడం చాలా సంతృప్తిని ఇస్తుందన్నారు. ఇలాంటి గొప్ప జీవులకు ధన్యవాదాలు అంటూ పోస్ట్‌మన్ డి. శివన్‌ను ప్రశంసించారు. మానవత్వం వృద్ధి చెందుతుందనేందుకు ఇదే నిదర్శనమని అన్నారు చిరు..