రజినీ ఆరోగ్యంపై స్పందించిన చిరంజీవి, మోహన్ బాబు

దిశ, వెబ్‌డెస్క్: సూపర్ స్టార్ రజినీకాంత్ అస్వ‌స్థ‌త‌కు లోనవడంతో సౌత్ ఇండియన్ ఇండస్ట్రీ మాత్రమే కాదు భారతీయ సినీ ప్రముఖులు అంతా రజినీ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. ప్రస్తుతం హైద‌రాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. బీపీ పెర‌గ‌డంతో ఇబ్బంది ప‌డ్డ‌ ఆయ‌నను వెంటనే ఆస్పత్రిలో చేర్పించారు. ఎప్పటికప్పుడు రజినీ ఆరోగ్య స్థితిని అపోలో వైద్యులు గమనిస్తున్నారు. అంతేగాకుండా ఆయన ఆరోగ్య విషయంపై హెల్త్ బులెటన్‌ కూడా విడుదల చేస్తున్నారు. అయితే ఆయన అస్వస్థతకు గురైన విషయం […]

Update: 2020-12-25 12:01 GMT

దిశ, వెబ్‌డెస్క్: సూపర్ స్టార్ రజినీకాంత్ అస్వ‌స్థ‌త‌కు లోనవడంతో సౌత్ ఇండియన్ ఇండస్ట్రీ మాత్రమే కాదు భారతీయ సినీ ప్రముఖులు అంతా రజినీ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. ప్రస్తుతం హైద‌రాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. బీపీ పెర‌గ‌డంతో ఇబ్బంది ప‌డ్డ‌ ఆయ‌నను వెంటనే ఆస్పత్రిలో చేర్పించారు. ఎప్పటికప్పుడు రజినీ ఆరోగ్య స్థితిని అపోలో వైద్యులు గమనిస్తున్నారు. అంతేగాకుండా ఆయన ఆరోగ్య విషయంపై హెల్త్ బులెటన్‌ కూడా విడుదల చేస్తున్నారు. అయితే ఆయన అస్వస్థతకు గురైన విషయం తెలిసిన ప్రముఖులంతా స్పందించారు. రజినీ సన్నిహితులపై మోహన్ బాబు, చిరంజీవి కూడా రజినీ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. విషయం తెలిసిన వెంటనే మోహన్ బాబు ర‌జ‌నీ భార్య ల‌త‌కు, కుమార్తె ఐశ్వ‌ర్య‌కు, సోద‌రికి ఫోన్లు చేశారు.

ర‌జ‌నీ ఆరోగ్యం నిల‌క‌డ‌గా ఉంద‌నీ, ఎలాంటి ఆందోళ‌నా ప‌డాల్సిన అవ‌స‌రం లేద‌నీ వారు చెప్ప‌డంతో మోహ‌న్‌బాబు కుదుట‌ప‌డ్డారు. ర‌జ‌నీ మాన‌సికంగా, శారీర‌కంగా దృఢ‌మైన వ్య‌క్తి అనీ, ఈ అస్వ‌స్థ‌త నుంచి ఆయ‌న త్వ‌ర‌గా కోలుకుని, ఎప్ప‌టిలా త‌న ప‌నులు మొద‌లుపెడ‌తార‌నీ మోహ‌న్‌బాబు ఆశాభావం వ్య‌క్తం చేశారు. అంతేగాకుండా ‘రజినీ కాంత్ అనారోగ్యం విషయం తెలిసి చాలా బాధపడ్డాను. ఆయన ఆరోగ్యం త్వరగా కుదుటపడి మళ్లీ హుషారుగా సినిమాలు చేయాలని ఆకాంక్షిస్తున్నాను.’’ అని చిరంజీవి అన్నారు.

Tags:    

Similar News