చిరుతో లవ్లీ హీరో.. మెమొరబుల్ పిక్
డైలాగ్ కింగ్ సాయికుమార్ కొడుకుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆది.. డెబ్యూ మూవీ ‘లవ్లీ’తో హిట్ కొట్టాడు. కెరీర్ మొదట్లో వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరించిన ఈ కుర్ర హీరో.. ఈ మధ్య కాస్త రేసులో వెనకబడటంతో తన పేరును ‘ఆది సాయికుమార్’గా మార్చుకుని అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. నటనలో మంచి ఈజ్ కనబరిచే ఈ యంగ్ హీరో.. తండ్రి మాదిరే డైలాగ్స్ కూడా ఇరగదీస్తాడు. అయితే సినిమాల్లోకి వచ్చేందుకు స్ఫూర్తినిచ్చింది మాత్రం మెగాస్టార్ చిరంజీవి అని చెబుతుండటం విశేషం. […]
డైలాగ్ కింగ్ సాయికుమార్ కొడుకుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆది.. డెబ్యూ మూవీ ‘లవ్లీ’తో హిట్ కొట్టాడు. కెరీర్ మొదట్లో వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరించిన ఈ కుర్ర హీరో.. ఈ మధ్య కాస్త రేసులో వెనకబడటంతో తన పేరును ‘ఆది సాయికుమార్’గా మార్చుకుని అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. నటనలో మంచి ఈజ్ కనబరిచే ఈ యంగ్ హీరో.. తండ్రి మాదిరే డైలాగ్స్ కూడా ఇరగదీస్తాడు. అయితే సినిమాల్లోకి వచ్చేందుకు స్ఫూర్తినిచ్చింది మాత్రం మెగాస్టార్ చిరంజీవి అని చెబుతుండటం విశేషం. ఆయనను చూసే డ్యాన్స్, యాక్టింగ్పై ఆదికి ఆసక్తి కలిగిందట.
ఇదిలా ఉంటే, తన అభిమాన నటుడు చిరంజీవి నుంచి అవార్డు అందుకున్న ఆది.. తాజాగా ఆ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. 1991లో ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో వచ్చిన కలికాలం సినిమా అప్పట్లో వంద రోజులు ఆడింది. ఈ చిత్రంలో చంద్రమోహన్, జయసుధ హీరో హీరోయిన్లు కాగా.. సాయి కుమార్ ప్రధాన పాత్రలో నటించారు. ఆ సినిమా 100 డేస్ ఫంక్షన్కు చిరంజీవి అతిథిగా విచ్చేశారట. కానీ ఆ సమయంలో అవార్డు అందుకునేందుకు సాయి కుమార్ అందుబాటులో లేకపోవడంతో.. తండ్రి తరపున చిరు చేతుల మీదుగా అవార్డు స్వీకరించాడు ఆది. ఈ ఫోటోలో చిరు ఆదిని ఎత్తుకుని మరీ అవార్డు అందించారు. కాగా ఈ క్యూట్ పిక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది.