ఒక్క షోకు రూ. 207 కోట్లు వసూల్ చేసిన హీరోయిన్
దిశ, సినిమా : కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా సినిమా ఇండస్ట్రీని నష్టాలబాట పట్టిస్తున్నా.. టాప్ స్టార్స్‌కు మాత్రం ఢోకా లేకుండా పోయింది. రెగ్యులర్ సినిమాలకు ఎంత రెమ్యునరేషన్ వసూలు చేస్తారో.. అంతే రెమ్యునరేషన్ తీసుకుంటూ ఓటీటీ కంటెంట్‌తో ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. ఈ క్రమంలో చైనీస్ సోషల్ మీడియా ఓ న్యూస్‌తో షాకైంది. టాప్ చైనీస్ స్టార్ జెంగ్ షువాంగ్ ఒక్క షో కోసం రూ. 207 కోట్లకు పైగా రెమ్యూనరేషన్ తీసుకోవడం హాట్ టాపిక్‌గా మారింది. 2019లో […]
దిశ, సినిమా : కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా సినిమా ఇండస్ట్రీని నష్టాలబాట పట్టిస్తున్నా.. టాప్ స్టార్స్‌కు మాత్రం ఢోకా లేకుండా పోయింది. రెగ్యులర్ సినిమాలకు ఎంత రెమ్యునరేషన్ వసూలు చేస్తారో.. అంతే రెమ్యునరేషన్ తీసుకుంటూ ఓటీటీ కంటెంట్‌తో ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. ఈ క్రమంలో చైనీస్ సోషల్ మీడియా ఓ న్యూస్‌తో షాకైంది. టాప్ చైనీస్ స్టార్ జెంగ్ షువాంగ్ ఒక్క షో కోసం రూ. 207 కోట్లకు పైగా రెమ్యూనరేషన్ తీసుకోవడం హాట్ టాపిక్‌గా మారింది. 2019లో ఓ కాస్ట్యూమ్ డ్రామాలో నటించేందుకు 77 రోజులు కేటాయించిన నటి.. రోజుకు 3,20,000 డాలర్లు తీసుకుందని మైక్రోబ్లాగింగ్ సైట్ వీబోలో ప్రచురితమైంది.
ఈ క్రమంలో అధిక వేతనం అందుకున్న జెంగ్.. పన్ను ఎగవేతకు పాల్పడిందన్న ఆరోపణలతో షాంఘై, బీజింగ్‌లోని అధికారులు దర్యాప్తు ప్రారంభించినట్లు చైనా మీడియా కథనాలు వెలువరించింది. ఈ మేరకు దీనిపై స్పందించిన యాక్ట్రెస్ తాను ఇన్వెస్టిగేషన్‌కు సహకరించేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపింది. కాగా ఈ విషయాన్ని జెంగ్ ఎక్స్ పార్ట్నర్, టెలివిజన్ ప్రొడ్యూసర్ జాంగ్ హెంగ్ బయటపెట్టాడు. తన షో కోసమే ఇంత పెద్ద మొత్తంలో వసూలు చేసినట్లు తెలిపాడు.