గాల్వాన్ లోయలో చనిపోయిన చైనా సైనికులు ఎంతమందో తెలుసా?

దిశ, వెబ్ డెస్క్: జూన్ 15వ తేదీన లడఖ్‌లోని గాల్వాన్ లోయలో ఇండియా గస్తీ సైనికులపై చైనా సైన్యం మెరుపుదాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో ఇండియా 21 మంది సైనికులను కోల్పోయింది. పలువురు గాయపడ్డారు. ఇరుకైన దారిలో చైనా సైనికులు ఎటాక్ చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఇండియన్ ఆర్మీ కూడా దానికి ధీటుగా సమాధానం చెప్పింది. చైనా వైపు భారీగానే సైనికులు మరణించారు. చైనా సైనికులు ఎంతమంది మరణించారు అనే విషయాన్ని చైనా […]

Update: 2020-07-06 11:05 GMT

దిశ, వెబ్ డెస్క్: జూన్ 15వ తేదీన లడఖ్‌లోని గాల్వాన్ లోయలో ఇండియా గస్తీ సైనికులపై చైనా సైన్యం మెరుపుదాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో ఇండియా 21 మంది సైనికులను కోల్పోయింది. పలువురు గాయపడ్డారు. ఇరుకైన దారిలో చైనా సైనికులు ఎటాక్ చేసిన సంగతి తెలిసిందే.

అయితే, ఇండియన్ ఆర్మీ కూడా దానికి ధీటుగా సమాధానం చెప్పింది. చైనా వైపు భారీగానే సైనికులు మరణించారు. చైనా సైనికులు ఎంతమంది మరణించారు అనే విషయాన్ని చైనా ఇప్పటివరకూ అధికారికంగా ప్రకటించలేదు. గాల్వాన్ లోయ దాడిలో 100 మందికి పైగా చైనా సైనికులు మరణించినట్టు చైనా మాజీ సైనికాధికారి జినాలి యాంగ్ పేర్కొన్నారు. చైనా సైనికులు భారీ సంఖ్యలో మరణించారని ఇండియన్ ఇంటిలిజెన్స్ గతంలోనే పేర్కొన్నది. తన సైనికుల మరణాల గురించి చైనా కావాలనే బయటకు చెప్పడం లేదు. గతంలో ఇండియాతో జరిగిన యుద్ధం సమయంలో కూడా చైనా సైనికుల మరణాల విషయాన్ని దాచిపెట్టింది.

Tags:    

Similar News