ఇండియన్ రైల్వేపై చైనా కంపెనీ పిటిషన్
దిశ, వెబ్‌డెస్క్: గాల్వాన్ వ్యాలీ ఘర్షణల నేపథ్యంలో దేశ వ్యాప్తంగా బ్యాన్ చైనా నినాదం ఊపందుకుంది. ఈ నేపథ్యంలోనే భారతీయ రైల్వే చైనా కంపెనీతో గతంలో చేసుకున్న కాంట్రాక్టును రద్దు చేసుకుంది. దీని విలువ రూ.470 కోట్లుగా ఉన్నది. అయితే, రైల్వే సిగ్నలింగ్ కాంట్రాక్టు నుంచి తమను తప్పించడంపై చైనా ఇంజినీరింగ్ కంపెనీ భారతీయ రైల్వే పై ఢిల్లీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. భారతీయ రైల్వేకి చెందిన ప్రభుత్వ రంగ సంస్థ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ […]
దిశ, వెబ్‌డెస్క్: గాల్వాన్ వ్యాలీ ఘర్షణల నేపథ్యంలో దేశ వ్యాప్తంగా బ్యాన్ చైనా నినాదం ఊపందుకుంది. ఈ నేపథ్యంలోనే భారతీయ రైల్వే చైనా కంపెనీతో గతంలో చేసుకున్న కాంట్రాక్టును రద్దు చేసుకుంది. దీని విలువ రూ.470 కోట్లుగా ఉన్నది. అయితే, రైల్వే సిగ్నలింగ్ కాంట్రాక్టు నుంచి తమను తప్పించడంపై చైనా ఇంజినీరింగ్ కంపెనీ భారతీయ రైల్వే పై ఢిల్లీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. భారతీయ రైల్వేకి చెందిన ప్రభుత్వ రంగ సంస్థ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (డీఎఫ్‌సీసీఐఎల్) తమ బ్యాంకు గ్యారంటీని క్యాష్ చేసుకోకుండా అడ్డుకోవాలంటూ చైనా కంపెనీ అభ్యర్ధించింది.
ఇదిలాఉంటే.. గత నాలుగేళ్లుగా చైనా కంపెనీ కేవలం 20 శాతం పనులు మాత్రమే పూర్తిచేసిందనీ.. పనుల్లో తీవ్ర అలసత్వం చూపుతున్నందున ఈ కాంట్రాక్టు నుంచి తప్పిస్తున్నట్లు ఢీఎఫ్‌సీసీఐఎల్ ప్రకటించింది. ఈ కాంట్రాక్టు ప్రకారం.. కాన్పూర్ దీన్‌దయాళ్ సెక్షన్‌కు సంబంధించి 417 కిలోమీటర్ల మేర సిగ్నల్స్ వ్యవస్థ పూర్తి కోసం 2016లో చైనా కంపెనీతో ఒప్పందం కుదిరింది.