ఇలా అయితే.. 'నేటి బాలలు రేపటి పౌరులు' ఎలా అవుతారు?
మారుతున్న జీవన విధానంతో బాల్యం మసక బారుతోంది. గ్రామీణ క్రీడలు ఒక్కొక్కటిగా కనుమరుగవుతున్నాయి. చిన్నారులు సెల్ఫోన్లు, టీవీలకే అతుక్కుపోతున్నారు. గంటల కొద్ది ఒకే చోట కూర్చోవడం, శారీరక శ్రమ లేకపోవడంతో అనారోగ్యం పాలవుతున్నారు. ఊబకాయం బారిన పడి 20ఏళ్లకే 60ఏళ్ల వయస్సు గల వారిగా కనిపిస్తున్నారు. నగరంలోని అనేక పాఠశాలలు ఇరుకైన గదుల్లో నిర్వహిస్తున్నారు. కనీసం క్రీడా మైదానాలు కూడా ఉండడం లేదు. దీంతో విద్యార్థులకు వ్యాయామం లేక శారీరక, మానసిక సమస్యలు తలెత్తున్నాయి. గ్రామాల్లోనూ పాతతరం […]
మారుతున్న జీవన విధానంతో బాల్యం మసక బారుతోంది. గ్రామీణ క్రీడలు ఒక్కొక్కటిగా కనుమరుగవుతున్నాయి. చిన్నారులు సెల్ఫోన్లు, టీవీలకే అతుక్కుపోతున్నారు. గంటల కొద్ది ఒకే చోట కూర్చోవడం, శారీరక శ్రమ లేకపోవడంతో అనారోగ్యం పాలవుతున్నారు. ఊబకాయం బారిన పడి 20ఏళ్లకే 60ఏళ్ల వయస్సు గల వారిగా కనిపిస్తున్నారు. నగరంలోని అనేక పాఠశాలలు ఇరుకైన గదుల్లో నిర్వహిస్తున్నారు. కనీసం క్రీడా మైదానాలు కూడా ఉండడం లేదు. దీంతో విద్యార్థులకు వ్యాయామం లేక శారీరక, మానసిక సమస్యలు తలెత్తున్నాయి. గ్రామాల్లోనూ పాతతరం ఆటలు కోతికొమ్మచ్చి, కబడ్డీ, ఖోఖో, తాడాట ఇలా అనేక క్రీడలు చిన్నారులకు తెలియకుండా పోతున్నాయి. కరోనా మహమ్మారి సైతం చిన్నారుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. రోజురోజుకూ వైరస్ బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతుండడం, పట్టణాలు, పల్లెలకు వైరస్ విస్తరిస్తుండడంతో పిల్లలను బయటకు పంపించాలంటేనే తల్లిదండ్రులు జంకుతున్నారు. దీంతో క్రీడలకు బాల్యం క్రమంగా దూరమవుతున్నది.
దిశ, హైదరాబాద్: ఉదయం లేచింది మొదలు రాత్రి నిద్రించే వరకు ఉరుకులు, పరుగులు పెట్టే నగర జీవనంలో బాల్యం సమిదగా మారు తోంది. నేటి పోటీ ప్రపంచంలో చిన్న, పెద్ద , ఆడ, మగ తేడా లేకుండా ప్రతీ ఒక్కరు శారీరక శ్రమకు దూరం కావ డంతో దాని ప్రభావం వారి ఆరోగ్యంపై కనబడుతోంది. సరి గ్గా పదేళ్లు నిండని బాలురు 50 కిలోల బరువు ఉంటున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. 20 ఏళ్లు వచ్చే వరకు షుగర్, బీపీ వంటి వ్యాధుల బారిన పడడంతో పాటు తెల్ల వెంట్రుకలు రావడం, చిన్న పనికే నీరసించిపోయి 60 ఏళ్ల వయస్సు వారిని తలపిస్తున్నారు. ఇందుకు కారణం వారి దైనందిన జీవితంలో వచ్చిన మార్పులే అని వైద్య నిపుణులు చెబుతున్నారు. నేడు నగరాలు, పట్టణాలు కాంక్రీట్ జంగల్ గా మారడంతో పిల్లలు ఆడుకునేందుకు మైదానాలు అందుబాటులో లేకుండా పోయాయి. ఇండోర్, ఔట్ డోర్ స్టేడియాలతో పాటు అక్కడక్కడ ఆట స్థలాలు ఉన్నప్పటికీ ఇవి అందరికీ అందుబాటులో లేవు.
దీనికి తోడు ఇరుకైన భవనాల్లో పాఠశాలు ఏర్పాటు చేస్తున్న యాజమాన్యాలు పిల్లలకు అవసరమైన ఆట స్థలాల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. ఇదే గ్రామాల్లో చదివే పిల్లలకు పాఠశాలల్లో కొంత మేర ఆట స్థలాలు ఉండడంతో వారు బయటకు వచ్చి ఆటలు ఆడుతున్నారు. ఒక ప్పటి పరిస్థతితో పోలిస్తే ప్రస్తుతం గ్రామా ల్లోని పిల్లలకు కూడా చాలా ఆట లు తెలియకుండా పోతున్నాయి. కేవలం క్రికెట్, బాస్కెట్ బాల్, ఫుట్ బా ల్, వాలీబాల్ వంటి క్రీడలే తప్ప ఇతర ఆటల గురించి పెద్దగా తెలియవు. మూడు నెలలుగా కరోనా వైరస్ తీవ్ర ప్రభావం చూపుతుండగా కనీసం పిల్లలను ఇంటి నుంచి బయటకు పంపడం లేదు. దీం తో చిన్నారులు టీవీలు, ఫోన్లకు అతుక్కు పోయి మరింత ఊబకాయులవుతున్నారు.
కనుమరుగవుతున్న క్రీడలు..
40 ఏళ్ల వయ స్సు ఉన్న ఎవరిని అడిగి నా వారు చిన్నతనంలో ఆట ల గురించి కథలుగా చెబు తారు. కబడ్డీ, ఖోఖో, గిల్లిదండి, వాలీబాల్, కోతి కొమ్మచ్చి, సీసం గోటీలు, రన్నింగ్, స్విమ్మింగ్, బేస్ బాల్, బ్యాడ్మింటన్, షటిల్, స్లో సైకిల్, దాడుగు మూతలు, తాడాట, రింగా ట, తాడు బొంగరం ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో రకాల ఆటలు అప్పట్లో ఆడేవారు. అయితే మారిన కాలానికి అనుగుణంగా కంప్యూటర్లు, సెల్ ఫోన్ లు, ల్యాప్ ట్యాప్ లు అందుబాటులోకి రావడంతో నేటి పిల్లలకు క్రీడలనేవి తెలియకుండా పోయాయి. దీంతో ఒకప్పటి గ్రామీణ, పట్టణ క్రీడలు కనుమరుగయ్యే ప్రమాదం ఏర్పడింది. ఒకప్పడు గ్రామాల్లోని వ్యవసాయ బావుల్లో నీరు పుష్క లంగా ఉండేది. సెలవు రోజుల్లో పిల్లలు బావుల్లో ఈత కొట్టేవారు. శరీరక వ్యాయంతో పిల్లలు ఆరోగ్యంగా, పటిష్టంగా ఉండేవారు. నేడు పరిస్థితులు మారాయి. గ్రామాలు, నగరాలు అనే తేడా లేకుండా నీటికి కొరత ఏర్పడింది. అయితే పట్టణాలు, నగరాల్లో కృత్రిమంగా స్విమ్మింగ్ పూల్స్ ఏర్పాటు చేసినా ప్రయోజనం అంతంత మాత్రంగానే ఉంది. గ్రామాల్లో నాడు పాఠశాల నుంచి ఇంటికి రాగానే పిల్లలు హోం వర్క్ పూర్తి చేసి స్నేహితులతో అన్ని రకాల ఆటలు ఆడేవారు. నేడు హోం వర్క్ పూర్తి చేసినా టీవీలు, కంప్యూటర్లు, సెల్ ఫోన్లకు అతుక్కు పోతున్నారు. దీంతో చిన్నవయస్సులోనే కంటి సమస్యలతో పాటు ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి.
క్రీడలెరుగని బాల్యం…
మారిన కాలానికి అనుగుణంగా నేటి బాలలు ఆధునిక సాంకేతిక నైపుణ్యం పెంపొందించుకుంటున్నప్పటికీ ఆటలంటే ఏమిటో తెలియకుండా పోతున్నాయి. క్రీడలు పిల్లలకు ఆరోగ్యాన్నిస్తుండగా కంప్యూటర్లు, సెల్ ఫోన్, టీవీలు వారి ఆరోగ్యంపై ప్రభావం చూపుతున్నాయి. శారీరక శ్రమ తగ్గి ఊబకాయం బారిన పడుతున్నారు. ‘నేటి బాలలే రేపటి పౌరులు’ అన్న నానుడి నిజం కావాలంటే వారు ఆరోగ్యంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇందుకు తల్లిదండ్రులే కాకుండా ప్రభుత్వాలు కూడా క్రీడలను ప్రోత్సహించాలని పలువురు కోరుతున్నారు.