యాదాద్రిలో శిశువిక్రయం కలకలం 

దిశ, వెబ్ డెస్క్: యాదాద్రి, భువనగిరి ఏరియా ఆసుపత్రిలో శిశు విక్రయం కలకలం రేపింది. రోజుల శిశువును 60 వేలకు సొంత తల్లే అమ్మేసింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనపై భువనగిరి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఓ కేసు విషయంలో నేరేడ్‌మెట్ పోలీసులు ఇద్దరు వ్యక్తులను విచారించగా ఈ శిశువిక్రయం వ్యవహారం బయటపడింది. నేరేడ్‌మెట్ ఎస్సై, యాదాద్రి భువనగిరి జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్కి సమాచారం అందించగా కేసు నమోదు చేశారు. వివరాల్లోకి […]

Update: 2020-09-23 00:14 GMT

దిశ, వెబ్ డెస్క్: యాదాద్రి, భువనగిరి ఏరియా ఆసుపత్రిలో శిశు విక్రయం కలకలం రేపింది. రోజుల శిశువును 60 వేలకు సొంత తల్లే అమ్మేసింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనపై భువనగిరి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఓ కేసు విషయంలో నేరేడ్‌మెట్ పోలీసులు ఇద్దరు వ్యక్తులను విచారించగా ఈ శిశువిక్రయం వ్యవహారం బయటపడింది.

నేరేడ్‌మెట్ ఎస్సై, యాదాద్రి భువనగిరి జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్కి సమాచారం అందించగా కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే… ఈ నెల 12న భువనగిరి ఏరియా ఆసుపత్రిలో ఆడశిశువును ప్రసవించింది ఓ యువతి. 14 ఘట్కేసర్, ఏదులాబాద్కు చెందిన మహిళకి రూ.60 వేలకు ఆ బిడ్డని కన్నతల్లి, తన తల్లితో కలిసి అమ్మేసింది.

నేరేడ్‌మెట్ పోలీసులు, ఆ జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ ఏదులాబాద్కు వెళ్లి శిశువును స్వాధీనం చేసుకున్నారు. తల్లీబిడ్డలను భువనగిరి జిల్లా కేంద్రంలోని సఖి సెంటర్లో అధికారుల పర్యవేక్షణలో ఉంచారు. ఈ వ్యవహారంపై భువనగిరి పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు.

Tags:    

Similar News