వరంగల్‌లో సీజేఐ పర్యటన.. ఎందుకో తెలుసా..?
దిశ ప్రతినిధి, వరంగల్: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ఈ నెల 18, 19వ తేదీల్లో ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటించనున్నారు. ఈనెల 18న హైదరాబాద్ నుంచి నేరుగా ములుగు జిల్లాలోని ప్రసిద్ధ రామప్ప దేవాయలంతో పాటు రామప్ప సరస్సును సందర్శించనున్నారు. అనంతరం తిరుగుప్రయాణమై హన్మకొండకు చేరుకుని ఇక్కడే బస చేస్తారు. ఆదివారం ఉదయం వరంగల్‌లోని భద్రకాళి ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు చేయనున్నారు. ఆ తర్వాత హన్మకొండలోని జిల్లా కోర్టు భవన సముదాయాన్ని […]
దిశ ప్రతినిధి, వరంగల్: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ఈ నెల 18, 19వ తేదీల్లో ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటించనున్నారు. ఈనెల 18న హైదరాబాద్ నుంచి నేరుగా ములుగు జిల్లాలోని ప్రసిద్ధ రామప్ప దేవాయలంతో పాటు రామప్ప సరస్సును సందర్శించనున్నారు. అనంతరం తిరుగుప్రయాణమై హన్మకొండకు చేరుకుని ఇక్కడే బస చేస్తారు. ఆదివారం ఉదయం వరంగల్‌లోని భద్రకాళి ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు చేయనున్నారు. ఆ తర్వాత హన్మకొండలోని జిల్లా కోర్టు భవన సముదాయాన్ని జస్టిస్ ఎన్వీ రమణ ప్రారంభించనున్నారు. అనంతరం తిరిగి ఆయన హైదరాబాద్‌లోని నల్సార్ యూనివర్సిటీకి చేరుకుంటారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.