కొరడా దెబ్బలు తిన్న సీఎం.. ఎందుకో తెలుసా..?
దిశ, వెబ్‌డెస్క్: ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్ కొరడాతో కొట్టించుకున్నారు. ముఖ్యమంత్రి కొరడాతో కొట్టించుకోవడం ఏమిటి అనుకుంటున్నారా..? కానీ, మీరు విన్నది నిజం. బఘేల్ ఏదో సరదా కోసమో, చేసిన తప్పునకు శిక్షగానో ఈ దెబ్బలు కొట్టించుకోలేదు. ఛత్తీస్‌గఢ్‌లో ప్రతి ఏటా గోవర్దన్ పూజ నిర్వహించడం ఆనవాయితీ. ఈ పూజలో భాగంగా గోమాతకు విశిష్టమైన పూజలు చేస్తారు. అందులో భాగంగా కొంతమంది కొరడాతో దెబ్బలు కొడుతుంటారు. ఇలా కొరడా దెబ్బలు తింటే తమ అభివృద్ధికి అడ్డంకులన్నీ తొలగిపోతాయని […]
దిశ, వెబ్‌డెస్క్: ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్ కొరడాతో కొట్టించుకున్నారు. ముఖ్యమంత్రి కొరడాతో కొట్టించుకోవడం ఏమిటి అనుకుంటున్నారా..? కానీ, మీరు విన్నది నిజం. బఘేల్ ఏదో సరదా కోసమో, చేసిన తప్పునకు శిక్షగానో ఈ దెబ్బలు కొట్టించుకోలేదు. ఛత్తీస్‌గఢ్‌లో ప్రతి ఏటా గోవర్దన్ పూజ నిర్వహించడం ఆనవాయితీ. ఈ పూజలో భాగంగా గోమాతకు విశిష్టమైన పూజలు చేస్తారు. అందులో భాగంగా కొంతమంది కొరడాతో దెబ్బలు కొడుతుంటారు. ఇలా కొరడా దెబ్బలు తింటే తమ అభివృద్ధికి అడ్డంకులన్నీ తొలగిపోతాయని ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర ప్రజల నమ్మకం. ఈ క్రమంలోనే సీఎం భూపేశ్ బఘేల్ కూడా కొరడా దెబ్బలు తిన్నారు. గ్రామ పెద్ద భరోసా ఠాకూర్ జంజ్‌గిరిలో ఈ సంప్రదాయాన్ని నిర్వహించి, ప్రజలను వారి కోరిక మేరకు కొరడాతో కొట్టేవారనీ, అతని మరణం తరువాత, అతని కుమారుడు బీరేంద్ర ఠాకూర్ అతని వారసత్వాన్ని ముందుకు తీసుకువెళుతున్నాడని అధికారులు తెలిపారు.