ఖాతాదారులకు షాక్ ఇవ్వనున్న పంజాబ్ నేషనల్ బ్యాంక్..
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ప్రభుత్వ రంగ పంజాబ్ నేషనల్ బ్యాంక్ తన వినియోగదారులకు కీలక ప్రకటనను విడుదల చేసింది. అక్టోబర్ నుంచి యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(యూబీఐ), ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఓబీసీ)లకు చెందిన చెక్‌బుక్‌లు పనిచేయవని, ఈ బ్యాంకులకు చెందిన ఖాతాదారులు గడువులోగా కొత్త చెక్‌బుక్‌లను మార్చుకోవాలని బ్యాంకు స్పష్టం చేసింది. 2020, ఏప్రిల్‌లో ప్రభుత్వం యూబీఐ, ఓబీసీ బ్యాంకులను పంజాబ్ నేషనల్ బ్యాంకులో విలీనం చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఖాతాదారుల సౌకర్యార్థం ఇప్పటివరకు […]
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ప్రభుత్వ రంగ పంజాబ్ నేషనల్ బ్యాంక్ తన వినియోగదారులకు కీలక ప్రకటనను విడుదల చేసింది. అక్టోబర్ నుంచి యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(యూబీఐ), ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఓబీసీ)లకు చెందిన చెక్‌బుక్‌లు పనిచేయవని, ఈ బ్యాంకులకు చెందిన ఖాతాదారులు గడువులోగా కొత్త చెక్‌బుక్‌లను మార్చుకోవాలని బ్యాంకు స్పష్టం చేసింది. 2020, ఏప్రిల్‌లో ప్రభుత్వం యూబీఐ, ఓబీసీ బ్యాంకులను పంజాబ్ నేషనల్ బ్యాంకులో విలీనం చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఖాతాదారుల సౌకర్యార్థం ఇప్పటివరకు పాత చెక్‌బుక్‌లనే కొనసాగించారు.
ఈ నేపథ్యంలో వచ్చే నెల నుంచి ఈ బ్యాంకులకు చెందిన చెక్‌బుక్‌లు పనిచేయవని, ఖాతాదారులు వీలైనంత తొందరగా పంజాబ్ నేషనల్ బ్యాంకు ఐఎఫ్ఎస్‌సీ, ఎంఐసీఆర్‌లతో ఉన్నటువంటి కొత్త చెక్‌బుక్‌లను తీసుకోవాలని పేర్కొంది. కొత్త చెక్‌బుక్‌లను కావాలనుకునేవారు ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఏటీఎం, పీఎన్‌బీ వన్ నుంచి తీసుకోవచ్చని, అలాగే, బ్యాంకుకు చెందిన శాఖల వద్ద కొత్త వాటిని పొందవచ్చని వెల్లడించింది.