అమెజాన్ ద్వారా కెమికల్స్.. బాంబ్ తయారీ

శ్రీనగర్ : గతేడాది కశ్మీర్‌లోని పుల్వామాలో జరిగిన ఆత్మాహుతి దాడి కేసులో ఎన్ఐఏ అధికారులు మరో ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. వైజ్ ఉల్ ఇస్లాం(19)ను శ్రీనగర్‌లో, మొహమ్మద్ అబ్బాస్ రాథర్(32)ను పుల్వామాలో అరెస్టు చేశారు. పాకిస్థాన్ బేస్డ్ జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థకు అబ్బాస్ ఓవర్ గ్రౌండ్ వర్కర్‌గా పనిచేస్తున్నట్టు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. జైషే టెర్రరిస్టు, ఐఈడీ ఎక్స్‌పర్ట్ మొహ్మద్ ఉమర్‌కు ఆశ్రయం ఇచ్చారని అంగీకరించాడు. కాగా, జైషే ఆదేశాల మేరకు ఐఈడీ తయారీ […]

Update: 2020-03-07 00:21 GMT

శ్రీనగర్ : గతేడాది కశ్మీర్‌లోని పుల్వామాలో జరిగిన ఆత్మాహుతి దాడి కేసులో ఎన్ఐఏ అధికారులు మరో ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. వైజ్ ఉల్ ఇస్లాం(19)ను శ్రీనగర్‌లో, మొహమ్మద్ అబ్బాస్ రాథర్(32)ను పుల్వామాలో అరెస్టు చేశారు. పాకిస్థాన్ బేస్డ్ జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థకు అబ్బాస్ ఓవర్ గ్రౌండ్ వర్కర్‌గా పనిచేస్తున్నట్టు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. జైషే టెర్రరిస్టు, ఐఈడీ ఎక్స్‌పర్ట్ మొహ్మద్ ఉమర్‌కు ఆశ్రయం ఇచ్చారని అంగీకరించాడు. కాగా, జైషే ఆదేశాల మేరకు ఐఈడీ తయారీ కోసం కెమికల్స్‌ను ఈ కామర్స్ సంస్థ అమెజాన్ ద్వారా కొనుగోలు చేశారని, బ్యాటరీలు, ఇతర యాక్ససరీలనూ కొన్నారని ఇస్లాం వెల్లడించినట్టు ఓ అధికారి తెలిపారు.

Tags: chemicals, amazon, NIA, pulwama attack, arrest

Tags:    

Similar News