క్లిష్ట సమయంలో కోర్టులు కీలకపాత్ర పోషించాయి : హిమ కోహ్లీ
దిశ, వెబ్‌డెస్క్ : దేశవ్యాప్తంగా రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. తెలంగాణలోనూ 72వ గణతంత్ర దినోత్స వ వేడుకలను ప్రభుత్వం అట్టహాసంగా నిర్వహించింది. హైకోర్టు పరిసరాల్లో నిర్వహించిన రిపబ్లిక్ డే వేడుకల్లో చీఫ్ జస్టిస్ హిమ కోహ్లీ హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. కొవిడ్ -19 ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో బాధలను మిగిల్చిందని తెలిపారు. ఆ సమయంలో ప్రజలందరూ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని అవగాహన కల్పించడంలో తెలంగాణ హైకోర్టు కీలకపాత్ర […]
దిశ, వెబ్‌డెస్క్ : దేశవ్యాప్తంగా రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. తెలంగాణలోనూ 72వ గణతంత్ర దినోత్స వ వేడుకలను ప్రభుత్వం అట్టహాసంగా నిర్వహించింది. హైకోర్టు పరిసరాల్లో నిర్వహించిన రిపబ్లిక్ డే వేడుకల్లో చీఫ్ జస్టిస్ హిమ కోహ్లీ హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. కొవిడ్ -19 ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో బాధలను మిగిల్చిందని తెలిపారు.
ఆ సమయంలో ప్రజలందరూ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని అవగాహన కల్పించడంలో తెలంగాణ హైకోర్టు కీలకపాత్ర పోషించిందన్నారు. అలాగే క్లిష్ట సమయంలో కూడా న్యాయస్థానాలు విధులు కొనసాగించాయని వెల్లడించారు. హైదరాబాద్ గ్లోబలు్ టెక్నాలజీని అందుకుంటూ వేగంగా ముందుకు దూసుకుపోతుందంటూ ఆమె వ్యాఖ్యానించారు.