వరల్డ్ రికార్డులో ఛత్తీస్‌గఢ్ పోలీసులకు చోటు..
దిశ, వెబ్ డెస్క్ : దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతుండటంతో దాని నివారణకు ఛత్తీస్‌గఢ్ పోలీసులు వినూత్న కార్యక్రమం చేపట్టారు. కరోనా పై అందరికీ అవగాహన కలిగించేందుకు సోమవారం రాఖీ సందర్భంగా మాస్కుల పంపిణీ చేపట్టడమే కాకుండా.. అందులో ప్రపంచ రికార్డు నెలకొల్పారు. వివరాల్లోకి వెళ్తే.. రాయ్‌ఘర్ జిల్లాలోని పోలీసులు సోమవారం కేవలం 6గంటల్లో 14 లక్షలకు పైగా మాస్క్‌లను పంపిణీ చేశారు. రాయ్‌ఘర్ జిల్లా పోలీస్ చీఫ్ సంతోష్ కుమార్ సింగ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం […]
దిశ, వెబ్ డెస్క్ : దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతుండటంతో దాని నివారణకు ఛత్తీస్‌గఢ్ పోలీసులు వినూత్న కార్యక్రమం చేపట్టారు. కరోనా పై అందరికీ అవగాహన కలిగించేందుకు సోమవారం రాఖీ సందర్భంగా మాస్కుల పంపిణీ చేపట్టడమే కాకుండా.. అందులో ప్రపంచ రికార్డు నెలకొల్పారు.
వివరాల్లోకి వెళ్తే.. రాయ్‌ఘర్ జిల్లాలోని పోలీసులు సోమవారం కేవలం 6గంటల్లో 14 లక్షలకు పైగా మాస్క్‌లను పంపిణీ చేశారు. రాయ్‌ఘర్ జిల్లా పోలీస్ చీఫ్ సంతోష్ కుమార్ సింగ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. దీనిపై సంతోష్ కుమార్ సింగ్ మాట్లాడుతూ.. మాస్క్‌తోనే రక్షణ అనే పేరుతో జరిగిన ఈ కార్యక్రమానికి మంచి స్పందన లభించిందన్నారు.
ఉదయం 9 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభం కాగా, సాయంత్రం 3 గంటల లోపు 14.87లక్షల మాస్క్‌లను పంపిణీ చేసినట్లు వెల్లడించారు. దీంతో గోల్డెన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో రాయ్‌ఘర్ పోలీసులు చోటు దక్కించుకున్నారని చెప్పారు. కార్యక్రమంలో పోలీసులకు సహాయంగా పలు ఏజెన్సీలు, ఆర్గనైజేషన్లు పాల్గొన్నట్లు సంతోష్ సింగ్ వెల్లడించారు.