సౌదీలో ప్రేమికుల్లో కొత్త మార్పు
సౌదీలో నివసించే వాళ్ల గురించి తలుచుకుంటే అప్పుడప్పుడు వాళ్లు హాస్టల్‌లో ఉంటున్నారేమో అనిపిస్తుంది. అక్కడ చేయగల పనుల కంటే నిషేధం ఉన్న పనులే ఎక్కువ. వాటిలో పెళ్లికి ముందు ప్రేమ కూడా ఒకటి. ఇలా నిషేధం ఉన్నప్పటికీ కొంతమంది తమకు నచ్చినట్లుగా జీవించడానికి ప్రయత్నిస్తున్నారు. కొంచెం రిస్కే అయినప్పటికీ ఈ మధ్య డేటింగులు, ఔటింగులు కూడా మొదలు పెట్టారు. ఒకప్పుడు సౌదీలో ఆడవాళ్లు […]
సౌదీలో నివసించే వాళ్ల గురించి తలుచుకుంటే అప్పుడప్పుడు వాళ్లు హాస్టల్‌లో ఉంటున్నారేమో అనిపిస్తుంది. అక్కడ చేయగల పనుల కంటే నిషేధం ఉన్న పనులే ఎక్కువ. వాటిలో పెళ్లికి ముందు ప్రేమ కూడా ఒకటి. ఇలా నిషేధం ఉన్నప్పటికీ కొంతమంది తమకు నచ్చినట్లుగా జీవించడానికి ప్రయత్నిస్తున్నారు. కొంచెం రిస్కే అయినప్పటికీ ఈ మధ్య డేటింగులు, ఔటింగులు కూడా మొదలు పెట్టారు.
ఒకప్పుడు సౌదీలో ఆడవాళ్లు తెలియని మగాళ్ల పక్కన కూర్చోవడానికి కూడా ముందుకు వచ్చేవారు కాదు. కానీ ఇప్పుడు కాలం మారుతోంది. అలాగే ప్రేమికుల రోజుకి సంబంధించి అన్ని రకాల వేడుకలను, విధానాలను సౌదీ ప్రభుత్వం నిషేధించినప్పటికీ ప్రేమ పక్షులు రహస్యంగా కలుసుకొని వేడుక జరుపుకుంటున్నారు.
2018లో మహ్మద్ బిన్ సల్మాన్ దయ వల్ల నిబంధనల్లో కొద్దిగా సడలింపు కల్పించినట్లు అనిపించినప్పటికీ దానిపై అధికారికంగా స్పష్టత లేకపోవడంతో యువ జంటలు ఇబ్బందులు పడుతున్నాయి. ఎంత రహస్యంగా కలుసుకున్నప్పటికీ కలుసుకున్న కొద్దిసేపైనా మాట్లాడుకునే వీలుండదు. ఎప్పుడు ఎవరు చూస్తారోననే భయం వారిలో ఉంటుంది.
ప్రభుత్వమే కాదు కుటుంబం కూడా
ప్రభుత్వం పెట్టే నిషేధాలు ఎప్పటికైనా సడలింపు అవుతాయనే భావన సౌదీ అమ్మాయిల్లో ఉంది. కానీ వారి కుటుంబాలు పెట్టే నిషేధాలు ఎప్పటికీ మారవని వారి అభిప్రాయం. ఒకవేళ మారినా ఇంట్లో నుంచి బయటికి వెళ్లేటపుడు వెనకాలే గూఢచారి లాగ ఎవరో ఒక కుటుంబ సభ్యుడు వచ్చి ఇబ్బంది పెట్టే అవకాశాలు చాలా ఎక్కువ.
అంతేకాకుండా అతి కష్టం మీద ప్రేమను సంపాదించుకుని, పెళ్లికి ముందే శృంగారం లాంటి పనులు చేసినా కూడా బ్లాక్ మెయిలింగ్ వంటి సమస్యలు ఉన్నాయని వారు అంటున్నారు. అయినప్పటికీ సౌదీ యువతలో ఇలాంటి మార్పు రావడం ఒక రకంగా శుభసూచకమేనని ప్రేమవాదులు అభిప్రాయపడుతున్నారు.