హైదరాబాద్‌వాసికి ఫొటోగ్రఫీలో అరుదైన గుర్తింపు

దిశ, సికింద్రాబాద్: హైదరాబాద్ నగరానికి చెందిన ఫొటోగ్రాఫర్ మెరుగు చంద్రశేఖర్‌కు సర్టిఫైడ్ మాస్టర్ ఫొటోగ్రాఫర్‌గా గుర్తింపు లభించింది. అలాగే ఫ్రోఫెషనల్ ఫొటోగ్రాఫర్స్ ఇంటర్నేషనల్ గౌరవ సలహాదారుడిగా నియమించామని ఆ సంస్థ అంతర్జాతీయ అధ్యక్షుడు యుకోవకు కేయూన్గు ఒక ప్రకటనలో వెల్లడించారు. సర్టిఫైడ్ మాస్టర్ ఫొటోగ్రాఫర్ గుర్తింపు పోటీల్లో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, గిరిజనుల జీవన శైలిపై తీసిన చిత్రాలను జ్యూరి సభ్యులు పరిశీలించి సర్టిఫైడ్ మాస్టర్ ఫొటోగ్రాఫర్‌గా చంద్రశేఖర్‌కు గుర్తింపునిచ్చారని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్ […]

Update: 2020-06-16 07:53 GMT

దిశ, సికింద్రాబాద్: హైదరాబాద్ నగరానికి చెందిన ఫొటోగ్రాఫర్ మెరుగు చంద్రశేఖర్‌కు సర్టిఫైడ్ మాస్టర్ ఫొటోగ్రాఫర్‌గా గుర్తింపు లభించింది. అలాగే ఫ్రోఫెషనల్ ఫొటోగ్రాఫర్స్ ఇంటర్నేషనల్ గౌరవ సలహాదారుడిగా నియమించామని ఆ సంస్థ అంతర్జాతీయ అధ్యక్షుడు యుకోవకు కేయూన్గు ఒక ప్రకటనలో వెల్లడించారు. సర్టిఫైడ్ మాస్టర్ ఫొటోగ్రాఫర్ గుర్తింపు పోటీల్లో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, గిరిజనుల జీవన శైలిపై తీసిన చిత్రాలను జ్యూరి సభ్యులు పరిశీలించి సర్టిఫైడ్ మాస్టర్ ఫొటోగ్రాఫర్‌గా చంద్రశేఖర్‌కు గుర్తింపునిచ్చారని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్ మాట్లడుతూ.. ప్రపంచవ్యాప్తంగా కేవలం 12 మందికిచ్చే అరుదైన గుర్తింపు భాతరదేశం నుంచి తనకు దక్కడం సంతోషంగా ఉందన్నారు. ఫొటోగ్రఫిలో నాణ్యమైన విద్యను తాను స్థాపించిన ‘సిగ్మా అకాడమీ ఆఫ్ ఫొటోగ్రఫి’ ద్వారా ఉచితంగా అందిస్తున్నానని ఆయన తెలిపారు.

Tags:    

Similar News