హీరో రామ్ కి చంద్రబాబు సపోర్ట్
దిశ, వెబ్ డెస్క్: విచారణకు ఆటంకం కలిగిస్తే హీరో రామ్ కి కూడా నోటీసులు ఇస్తామంటూ విజయవాడ ఏసీపీ చేసిన వ్యాఖ్యలను టీడీపీ అధినేత చంద్రబాబు తప్పుబట్టారు. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను హరించడం ప్రజాస్వామ్యానికే మాయని మచ్చని ఆయన ఓ ప్రకటనలో వెల్లడించారు. ట్వీట్ పెట్టడమే విచారణకు అడ్డుపడటంగా నోటీసులు ఇస్తామని బెదిరించడాన్ని చంద్రబాబు ఖండించారు. రాష్ట్రంలో భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను ఏవిధంగా కాలరాస్తున్నారో అనడానికి ఇది మరో ఉదాహరణ అని ఆయన మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రాథమిక హక్కులను ఉల్లంఘిస్తున్నారని […]
దిశ, వెబ్ డెస్క్: విచారణకు ఆటంకం కలిగిస్తే హీరో రామ్ కి కూడా నోటీసులు ఇస్తామంటూ విజయవాడ ఏసీపీ చేసిన వ్యాఖ్యలను టీడీపీ అధినేత చంద్రబాబు తప్పుబట్టారు. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను హరించడం ప్రజాస్వామ్యానికే మాయని మచ్చని ఆయన ఓ ప్రకటనలో వెల్లడించారు.
ట్వీట్ పెట్టడమే విచారణకు అడ్డుపడటంగా నోటీసులు ఇస్తామని బెదిరించడాన్ని చంద్రబాబు ఖండించారు. రాష్ట్రంలో భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను ఏవిధంగా కాలరాస్తున్నారో అనడానికి ఇది మరో ఉదాహరణ అని ఆయన మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రాథమిక హక్కులను ఉల్లంఘిస్తున్నారని ఆరోపించారు. ప్రశ్నించే గొంతును అణిచేయాలని చూడటం ప్రజాస్వామ్యానికి చేటు అని వ్యక్తం చేశారు.