పోలవరంపై జగన్‌కు అవగాహన లేదు !

దిశ, ఏపీ బ్యూరో: నీతి ఆయోగ్ సూచన మేరకే పోలవరం ప్రాజెక్ట్‌‌ను అప్పటి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. కరువుతో అల్లాడే రాయలసీమను రతనాల సీమగా మార్చేందుకే దృష్టిసారించానన్నారు. ప్రస్తుతం అధికార పార్టీ నేతలు తమను బద్నాం చేసే విధంగా మాట్లాడటం తగదని, గోదావరి, కృష్ణా నదులను ఏకం చేసిన ఘనత టీడీపీ ప్రభుత్వానిదేనని గుర్తు చేశారు. పోలవరం ప్రాజెక్టును తామే పూర్తి చేస్తామని గతంలో యూపీఏ ప్రభుత్వం చెప్పిందన్నారు. తర్వాత 2019లో రూ.55వేల కోట్ల […]

Update: 2020-11-01 12:06 GMT
పోలవరంపై జగన్‌కు అవగాహన లేదు !
  • whatsapp icon

దిశ, ఏపీ బ్యూరో: నీతి ఆయోగ్ సూచన మేరకే పోలవరం ప్రాజెక్ట్‌‌ను అప్పటి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. కరువుతో అల్లాడే రాయలసీమను రతనాల సీమగా మార్చేందుకే దృష్టిసారించానన్నారు. ప్రస్తుతం అధికార పార్టీ నేతలు తమను బద్నాం చేసే విధంగా మాట్లాడటం తగదని, గోదావరి, కృష్ణా నదులను ఏకం చేసిన ఘనత టీడీపీ ప్రభుత్వానిదేనని గుర్తు చేశారు. పోలవరం ప్రాజెక్టును తామే పూర్తి చేస్తామని గతంలో యూపీఏ ప్రభుత్వం చెప్పిందన్నారు. తర్వాత 2019లో రూ.55వేల కోట్ల అంచనాను సాంకేతిక సలహా కమిటీ ఆమోందించినట్లు నాడు ప్రశ్నించిన ఎంపీలకు కేంద్రం సమాధానం ఇచ్చిందన్నారు. నిర్మాణం జాప్యమయ్యే కొద్దీ ప్రాజెక్టు వ్యయం పెరగడం సహజమన్నారు. సీఎం జగన్​కు ప్రాజెక్టు గురించి అవగాహన లేకపోవడం వల్ల రాజకీయం చేస్తున్నట్లు చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.

Tags:    

Similar News