AP News : అమరావతిలో అంతిమ విజయం ప్రజలదే: చంద్రబాబు..
దిశ, ఏపీ బ్యూరో: అమరావతి రైతులు చేపట్టిన ఉద్యమం 700 రోజులకు చేరిన నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ట్విటర్ వేదికగా స్పందించారు. రాజధాని రైతుల మహోద్యమం 700కు చేరిందని అభిప్రాయపడ్డారు. రైతు ఉద్యమంలో భాగంగా న్యాయస్థానం నుంచి దేవస్థానం పేరిట మహా పాదయాత్ర కూడా..16వ రోజుకు చేరుకుందని చెప్పుకొచ్చారు. ఉద్యమంలో అమరులైన 189 మంది రైతులకు ఈ సందర్భంగా నివాళులర్పించారు. ఏపీ ప్రజలంతా అమరావతినే తమ రాజధానిగా కోరుకుంటున్నారని మహా పాదయాత్రకు లభిస్తోన్న మద్దతు […]
దిశ, ఏపీ బ్యూరో: అమరావతి రైతులు చేపట్టిన ఉద్యమం 700 రోజులకు చేరిన నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ట్విటర్ వేదికగా స్పందించారు. రాజధాని రైతుల మహోద్యమం 700కు చేరిందని అభిప్రాయపడ్డారు. రైతు ఉద్యమంలో భాగంగా న్యాయస్థానం నుంచి దేవస్థానం పేరిట మహా పాదయాత్ర కూడా..16వ రోజుకు చేరుకుందని చెప్పుకొచ్చారు. ఉద్యమంలో అమరులైన 189 మంది రైతులకు ఈ సందర్భంగా నివాళులర్పించారు.
ఏపీ ప్రజలంతా అమరావతినే తమ రాజధానిగా కోరుకుంటున్నారని మహా పాదయాత్రకు లభిస్తోన్న మద్దతు చూస్తే తెలుస్తోందని చంద్రబాబు పేర్కొన్నారు. ప్రజల ఆకాంక్షలతో తమకు పనిలేదన్నట్టుగా ప్రభుత్వ వైఖరి ఉందని చంద్రబాబు మండిపడ్డారు. రైతుల పాదయాత్రపై ప్రభుత్వం అడుగడుగునా ఆంక్షలు పెడుతోందని ధ్వజమెత్తారు. మద్దతు తెలిపిన ప్రజలపై లాఠీచార్జ్ చేయిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంత దౌర్జన్యం చేసినా ప్రజల ఆకాంక్షను అణగదొక్కలేరని చంద్రబాబు స్పష్టం చేశారు. అంతిమ విజయం అమరావతి రైతులు, ప్రజలదేనని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు.