హైదరాబాద్ అభివృద్ధికి పునాది వేసింది మేము : చంద్రబాబు
దిశ, వెబ్‌డెస్క్ : గ్రేటర్ ఎన్నికల్లో హైదరాబాద్‌ను అభివృద్ధి చేసింది తామంటే తామని అటు అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ నగర వాసుల చెవులకు చిల్లులు పడేలా ప్రచారం చేశాయి. అయితే కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలు చేసిందేమీ లేదని, నిజంగా అభివృద్ది జరిగితే వరదల సమయంలో హైదరాబాద్ ఎందుకు ముంపునకు గురవుతుందని బీజేపీ విమర్శల వర్షం కురిపించిన విషయం తెలిసిందే. తాజాగా గ్రేటర్ హైదరాబాద్ విశ్వనగరంగా మారడానికి పునాది రాయి వేసింది తామేనని టీడీపీ అధినేత […]
దిశ, వెబ్‌డెస్క్ : గ్రేటర్ ఎన్నికల్లో హైదరాబాద్‌ను అభివృద్ధి చేసింది తామంటే తామని అటు అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ నగర వాసుల చెవులకు చిల్లులు పడేలా ప్రచారం చేశాయి. అయితే కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలు చేసిందేమీ లేదని, నిజంగా అభివృద్ది జరిగితే వరదల సమయంలో హైదరాబాద్ ఎందుకు ముంపునకు గురవుతుందని బీజేపీ విమర్శల వర్షం కురిపించిన విషయం తెలిసిందే. తాజాగా గ్రేటర్ హైదరాబాద్ విశ్వనగరంగా మారడానికి పునాది రాయి వేసింది తామేనని టీడీపీ అధినేత చంద్రబాబు ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని ఓటర్లకు పిలుపునిచ్చారు.
#VoteForCycle #VoteForTDP https://t.co/4IfVDwkD2T
— Lokesh Nara #StayHomeSaveLives (@naralokesh) November 29, 2020
‘హైదరాబాద్ నగరం సర్వతోముఖాభివృద్ధికి పునాదులు వేసింది తెలుగుదేశం పార్టీ. ప్రజాశ్రేయస్సు పట్ల మాకున్న ఆకాంక్ష ఫలితమే సైబరాబాద్. సాప్ట్ వేర్ రంగం ప్రస్థానం మొదలైందే హైటెక్ సిటీ నుంచి. అవుటర్ రింగ్ రోడ్డు, ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్, జీనోమ్ వ్యాలీ.ఇలా చెప్పుకుంటూపోతే ఎన్నో చెప్పాల్సి ఉంటుంది. మాటలకన్నా చేతల్లోనే మేం చూపాం.. బిల్ గేట్స్, బిల్ క్లింటన్ లాంటి ప్రముఖులను రప్పించి భావితరానికి బాటలు వేయగలిగాం. ఉపాధి కల్పన, సంపద సృష్టి, సంక్షేమం.. ఇవే లక్ష్యంగా ముందుకు సాగాం.
ఎన్నో కుటుంబాల్లో వెలుగులు మా తెలుగు దేశానివే అని సగర్వంగా చెప్పగలం. ఆ వెలుగులు మళ్లీ రావాలంటే తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను గెలిపించండి.. GHMC ఎన్నికల్లో సైకిల్ గుర్తుకు మీ అమూల్యమైన ఓటు వేయండి అంటూ ట్వీట్ చేశారు.